గాంధీజీ మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శం. కలెక్టర్ భవేశ్ మిశ్రా

Submitted by srinivas on Mon, 03/10/2022 - 12:44
Gandhiji's way is ideal for everyone. Collector Bhavesh Mishra

భూపాలపల్లి ప్రతినిది,అక్టోబర్ 2(ప్రజాజ్యోతి)./...మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.   జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం చెల్పూరు బస్టాండ్ లో గల గాంధీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి.ఎస్. దివాకర తో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ   మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సత్యం అహింస అనే ఆయుధాలతో గాంధీ జీవితంలో అనేక విజయాలు సాధించారని జిల్లా కలెక్టర్ అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించటానికి గత ఆగస్టు మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులకు థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించాలని అన్నారు. 
మహాత్మా గాంధీ భారత దేశానికి పరిమితమైన నాయకుడు కాదని, ప్రపంచ దేశాలలో సైతం గాంధీ విధానానికి మంచి ఆదరణ ఉందని, గాంధీ చూపిన స్ఫూర్తితో నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు ఎంతో మంది పోరాటాలు చేసి విజయం సాధించారని  కలెక్టర్ అన్నారు.


దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేసే సమయంలో నల్లజాతీయుల పై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా గాంధీ పోరాటం చేసి విజయం సాధించారని, అనంతరం భారతదేశం లో భారతీయులు పడుతున్న బాధలను భారతీయుల పట్ల జరుగుతున్న వివక్షను గమనించి స్వరాజ్యం దీనికి పరిష్కారం అని భావించి, శాంతియుతంగా అనేక ఉద్యమాలు చేశారని ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి నినాదాలతో దేశ స్వాతంత్ర ఉద్యమంలో  చురుగ్గా పాల్గొని విజయం సాధించాలని అన్నారు.గాంధీ జీవిత చరిత్ర అన్ని భాషల్లో అందుబాటులో ఉందని, తాను సైతం 3 సార్లు చదివి ప్రేరణ పోందానని కలెక్టర్ తెలిపారు. 2001 సంవత్సరంలో పరదేసి మ్యాగజైన్ టైమ్స్  శతాబ్దంలో ఉత్తమమైన 100 మంది జాబితాలో గాంధీ ముందు వరుసలో నిలిచారని కలెక్టర్ పేర్కొన్నారు. భారతదేశ యువత మరియు ప్రజలు గాంధీజీ చూపిన మార్గంలో పయనిస్తూ దేశ అభివృద్ధికి దోహదపడాలని  కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర్,  స్థానిక ప్రజా ప్రతినిధులు,  అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.