కట్కూరు గ్రామంలో ఉచిత వైద్య మెగా శిబిరం... 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 13:14
Free medical mega camp in Katkuru village...  Medical tests were conducted for 500 people


 బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబర్ 27. ప్రజాజ్యోతి.//.... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో నరేంద్ర మోడీ  జన్మదినం సెప్టెంబర్ 17 శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ  జన్మదినం సెప్టెంబర్ 25 మరియు మహాత్మా గాంధీ  జన్మదినం అక్టోబర్ 2 ఈ ముఖ్యమైన రోజులను ఉద్దేశించి 15 రోజులను సేవా సప్తాహంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సేవా కార్యక్రమాలు చేయాలని భారతీయ జనతా పార్టీ తన యొక్క కార్యకర్తలను ఆదేశించింది. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు ,మెడికల్ క్యాంపులు, చెట్లు నాటే కార్యక్రమం, వికలాంగులకు వారి యొక్క అవసరాల నిమిత్తం ట్రై సైకిల్ లాంటివి ఇవ్వడం మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించినారు. ఇందులో భాగంగా ఈరోజు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో SMR హాస్పిటల్ బొడుప్పల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో స్త్రీ వైద్య నిపుణులు , ఎముకల వైద్య నిపుణులు , జనరల్ మెడిసిన్ డాక్టర్, గుండె వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రక్త పరీక్షలు షుగర్, బీపీ పరీక్షలు, ఈసీజీ మరియు ఇతర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది పేషెంట్లు వారి యొక్క వివిధ సమస్యలను డాక్టర్ల విన్నవించి వారి యొక్క సమస్యలకు పరిష్కారం పొందినారు. ఇట్టి కార్యక్రమంలో బల్ల శ్రీనివాస్ గారి మరియు కట్కూరు బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు DR ఆరుట్ల దశమంత రెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి, ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప, రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతి రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ , కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యం,మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్, యువమోర్చా మండల అధ్యక్షుడు బంగారు మహేష్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు ఉమ్మెత్తల మల్లారెడ్డి, దబ్బగుంటపల్లి సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి కొడవటూరు ఎంపీటీసీ నీల శైలజ రమేష్,యువమోర్చా మండలం ప్రధాన కార్యదర్శి గద్దరాజు, బూత్ అధ్యక్షులు కదునూరి పాండు ,గుడ్ల మల్లయ్య, శివకుమార్, బాల నర్సయ్య, నాగరాజు, పరశురాములు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.