సాగర్ కాలువ గండి తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి... బెల్లంకొండ సత్యనారాయణ..

Submitted by shaikmohammadrafi on Thu, 22/09/2022 - 13:02
Farmers who have lost crops due to Sagar canal should be supported...  Bellamkonda Satyanarayana..


 రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి..

నడిగూడెం, సెప్టెంబర్ 21, ప్రజా జ్యోతి:  మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నందు బుధవారం గ్రామ రైతు సంఘం మహాసభ సింగిల్ విండో  డైరెక్టర్ బీరవెల్లి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ సాగర్ ఎడమ  కాలువకు గండి పడి లిఫ్టు ల కింద  వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 40 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బ్యాంకుల్లో తీసుకున్న రైతుల అప్పులు రుణమాఫీ చేయకుండా ప్రైవేట్ అప్పు దొరకక రైతులు వ్యవసాయాన్ని ఎంతో ఇబ్బందులతో చేస్తున్నారని  సాగర్ ఎడమ కాలువ  గండి రూపంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీలు ఎత్తివేసి మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తుందని రైతులు మరో పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు.ఈ సందర్బంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో రైతులు కోరట్ల ప్రసాద్, సిల్క్ ఏసు,  లచ్చయ్య, లింగయ్య, ముహూర్తాల లక్ష్మారెడ్డి, లచ్చయ్య, వీరన్న, సైదా , లక్ష్మయ్య, సీతారాం రెడ్డి  తదితరులు పాల్గొన్నారు...