వైద్య వృత్తిలో ప్రతి ఒక్కరు పేదల పట్ల సేవాభావంతో మెలగాలి -వేంపాడు సర్పంచ్ అర్వ స్వాతి అశోక్ యాదవ్

Submitted by venkat reddy on Mon, 26/09/2022 - 13:23
Everyone in the medical profession should have a sense of service towards the poor - Vempadu Sarpanch Arva Swati Ashok Yadav

వేంపాడులో ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ

నిడమనూరు, సెప్టెంబర్25(ప్రజాజ్యోతి): వైద్య వృత్తిలో పేదల పట్ల సేవాభావంతో మెలగాలని వేంపాడు సర్పంచ్ అర్వ స్వాతి అశోక్ యాదవ్ అన్నారు. ఆదివారం  సువర్ణ మల్టీస్పెషల్టి హాస్పిటల్  డాక్టర్ హనుమంత రెడ్డి , భవ్య రెడ్డిల మిర్యాలగూడ ఆద్వర్యంలో నిడమనూరు మండలం వేంపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వేంపాడు సర్పంచ్ అర్వ స్వాతి అశోక్ యాదవ్  మాట్లాడుతూ సామాజిక సేవ అభినందనీయమన్నారు.సుపర్ణ హాస్పిటల్ వారి ఉచిత సేవలు కొనసాగించాలని వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు పేదల పట్ల సేవాభావంతో వైద్యం నిర్వహించాలని కోరారు.