గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీతాలు పెంచాలని ధర్నా

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:42
 Dharna for increase in salaries under Gram Panchayat Workers Union

అల్లంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27:   ఇటిక్యాల మండలం .ఎంపీడీవోకార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జూనియర్ అసిస్టెంట్ భారతి కి .ఇవ్వడం జరిగిందిఐఎఫ్ టి యు జిల్లా కోశాధికారి జమ్మి చేడు కార్తీక్  మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ వర్కర్స్కు 2019 నుండి జీతాలు పెంచలేదు 30% జీతాలను పెంచుతానని ప్రకటించి సీఎం కెసిఆర్ నేటికే అవి అమలు కాలేదు .కనీస వేతన చట్టం ప్రకారం 26 వేల రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉండగా 8500 ఇచ్చి కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని 8500తో వాళ్ల కుటుంబాల ఇబ్బందులతో కార్మికులు  జీవిస్తున్నారు ఇప్పటికీ జిల్లాలో రాష్ట్రంలో అనేక మంది కార్మికులు పనిచేస్తూ ప్రమాదంలో. చనిపోతే ఎవరికి కూడా బీమా సౌకర్యం ఇవ్వలేదు ప్రమాద మరణం జరిగితే కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలి సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి కొత్త సిబ్బందిని నియమించకపోవడం వల్ల పని భారాన్ని భరించి పది 12 గంటలు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం జీతాలు పెంచడం లేదు ఈ విషయాలు ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు.

గ్రామాల్లో సర్పంచ్లు గ్రామ కార్యదర్శులు కార్మికులను అనే క ఇబ్బందులకు గురిచేస్తున్నారు.వర్కర్స్ ను అక్రమంగా తొలగిస్తున్నారు అక్రమ తొలగింపునకు స్వస్తిపలికి తొలగించిన వర్కర్స్ ను.పనిలో తీసుకోవాలి వారికి పని భద్రత కల్పించాలి నెల నెల జీతాలు ఇవ్వాలి. పనిముట్లని ఇవ్వాలి ప్రతి సంవత్సరం రెండు జతల బట్టలు ఇవ్వాలి బీమా సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలి గ్రామపంచాయతీలలో అవసరమైన కొత్త సిబ్బందిని నియమించాలి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి . కాంట్రాక్టు ప్రైవేటు పనులను జిపి వర్కర్స్ ద్వారా చేయించరాదు పై సమస్యల సాధన కోసం తేదీ 30 సెప్టెంబర్ 202 2న జోగులాంబ గద్వాల జిల్లా లో.  జరిగే మహాధర్మాలో జిపి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో మండల నాయకులు రషీద్ ,వెంకటేష్ ,నరసింహులు ,రాణి ,లచ్చమ్మ,సుబ్బమ్మ ,నారాయణ, ఎర్రన్న,   సుధాకర్ ,శాంతి రాజు, వెంకటరామ్ రెడ్డి, సురేష్  ,రంగన్న, మౌలాలి ,గోపాల్  ,శేఖర్ ,రాకేష్ , తదితరులు పాల్గొన్నారు.