బిజెపి వల్లనే దళిత.. గిరిజన బందు మల్లెపాక సాయిబాబా

Submitted by Yellaia kondag… on Tue, 20/09/2022 - 17:06
Dalit is because of BJP.. Tribal bandu Mallepak Sai Baba

తుంగతుర్తి, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):బిజెపి పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  భయపడి దళిత, గిరిజన బందును ప్రవేశపెట్టారని బిజెపి పార్టీ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజన బంద్ కు కారకులైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  చిత్రపటాలకు తుంగతుర్తి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా  మల్లె పాక సాయిబాబా మాట్లాడుతూగత ఎనిమిది సంవత్సరాలుగా గుర్తుకురాని దళిత.. గిరిజనుల సమస్యలు  ఉప ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్యమంత్రికి గుర్తుకు  రావడం అస్యాస్పదమన్నారు.  రాజకీయాలకతీతంగా దళిత, గిరిజన బందు పథకాన్ని ప్రకటించాలని, లేనిచో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు.ఇంటికి కిలో బంగారం ఇచ్చిన టిఆర్ఎస్ కు ప్రజలు ఓటెయ్యరని.. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

 మునుగోడులో బీజేపీని గెలిపిస్తే కేసీఆర్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని  సాయిబాబా జోస్యం చెప్పారు. మునుగోడు నియోజకవర్గాన్ని దళిత గిరిజన బహుజనులు అందరూ ఏకమై బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు గాజుల మహేందర్ పటేల్, నారాయణ దాసు నాగరాజు, లింగయ్య యాదవ్, రఫిక్, వెంకన్న, రాజు, శరత్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.