కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించిన కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్

Submitted by Upender Bukka on Thu, 29/09/2022 - 13:11
Councilor Kakkireni Srinivas launched the kids play zone

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 28 సెప్టెంబర్,../ సూర్యాపేట పట్టణంలో ఫన్ విల్లే కిడ్స్ ప్లే జోన్ 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ తో కలిసి 44వ వార్డు కౌన్సిలర్ కెక్కిరేని  శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పిల్లలు పాఠశాలలో చదువుతోపాటు  క్రీడలు, వినోదాలు చిన్నారుల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కిడ్స్ ప్లే జోన్ లో చిన్నారులకు బాల్ పూల్ స్పైడర్, సాఫ్ట్ ప్లే, జంపింగ్ బాల్స్, కిచెన్ రూమ్, ప్లే మినీ కార్, రాకర్స్, ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేవలం అతి పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఇటువంటి కిడ్స్ ప్లే జోన్ సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యజమాని గుమ్మడవెల్లి విజయ్ కుమార్, నాయకులు బోల్లం సురేష్, అనంతుల శ్రీనివాస్, గుడిపాటి రమేష్ , నాగరాజు ,బజ్జురి శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, నేతాజీ, తదితరులు పాల్గొన్నారు.