కాంగ్రెస్ పార్టీ మునుగోడు మండల ముఖ్యకార్యకర్తల సమన్వయ సమావేశం

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 12:21
Coordination meeting of Munugodu mandal chief workers of Congress party

*స్పీఎల్పీ నేత భట్టి విక్రమార్కప్రెస్ మీట్

మునుగోడు సెప్టెంబర్ 18 (ప్రజజ్యోతి):కాంగ్రెస్ పార్టీకి మునుగోడు బలమైన నియోజకవర్గంతెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ పైన మునుగోడు ప్రజలకు ఎనలేని అభిమానం ఉందిసామ్యవాద లౌకికవాద భావజాలం కలిగిన మునుగోడు ప్రజలు వారికి ఉపయోగపడే పార్టీలనే ఇప్పటివరకు గెలిపించారుసామ్యవాద లౌకికవాద భావజాలం కలిగిన ప్రజలను డబ్బుతో కొనుగోలు చేయొచ్చన్న భ్రమల్లో టిఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి.సిద్ధాంతాల భావజాలానికి కట్టుబడి ఉంటారే తప్ప మునుగోడు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోరు.నిజాం అహంకారానికి వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల మెడలు వంచిన గడ్డ మునుగోడుడబ్బు అహంకారాన్ని ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ బిజెపి మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారుతెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి సవాల్ చేస్తూ అడుగులు వేస్తూ అణగదొక్కుతున్నదిఅధికారానికి డబ్బుకు అడ్డే లేదన్న అహంభావపూరిత వాతావరణంలో తెలంగాణ పై బిజెపి దాడి చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్నదితెలంగాణ ప్రజలను అనగదొక్కాలని చూసిన ప్రతి సందర్భంలో మట్టి మనుషులుగా ఎదిరించి ఎదురొడ్డి పోరాటం చేశారు తప్ప తలవంచుకున్న చరిత్ర ఈ పోరాటాల గడ్డకు లేదు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ఇక చాలు అని ప్రజలు అంటున్నారు

   తెచ్చుకున్న తెలంగాణ సమాజంలో తలెత్తుకొని బతకాలన్న ఆత్మగౌరవం టిఆర్ఎస్ పాలనలో భంగపాటయిందిఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన టిఆర్ఎస్ పార్టీ డబ్బు ,మద్యం ప్రలోభాలతో మునుగోడును ఆక్రమణ చేయాలని చూస్తున్నది.పోరాటాల గడ్డకు కేంద్ర బిందువైన మునుగోడు ప్రజలు ఇక టిఆర్ఎస్ పాలన చాలు అని అంటున్నారుపేదలతో మమేకమై సామాన్యులతో కలిసిపోయి ప్రతి ఇంటి మనిషిగా ప్రజల హృదయాల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్న దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తనయురాలు స్రవంతి మునుగోడు ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిందిఆడబిడ్డ స్రవంతిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడానికి మునుగోడు ప్రజలు సిద్ధమై ఉన్నారుమునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను దశా దిశ చేయబోతుందిరాష్ట్ర ప్రజల భవిష్యత్తు మునుగోడు ప్రజల నిర్ణయాత్మకమైన తీర్పు పైనే ఆధారపడి ఉందిరాష్ట్ర ప్రజల సంక్షేమంగా మీ ఓటు ఉండాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తిప్రజలను అనగదొక్కాలని దోపిడీకి పాల్పడాలని చూస్తున్న బిజెపి టీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

        రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఏ నోటుకు అమ్ముడుపోకుండా మునుగోడు ప్రజలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని విజ్ఞప్తి