తాత్కాలిక మరమ్మతులకేనా ఈ వంతెన

Submitted by venkat reddy on Sun, 11/09/2022 - 10:06
This bridge is for temporary repairs
  • ఏడాదికోసారి నిడమనూరు-బంకాపురం కల్వర్టు పై రాకపోకలు బంద్
  • నిడమనూరు-బంకాపురం మధ్య తెగిపోయిన వంతెన 
  • రెండేళ్ల చిలకవాగు వరద వల్లన వీదినపడ్డ ఓ కుటుంబం
  • ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన  పట్టించుకోని నాయకులు, అధికారులు
  • కాల్వర్టు కుంగిపోయిన వాగులో పండి ట్రాక్టర్ ట్రాలీ 
  • వరద తాకిడికి కల్వర్టపై కంపచెట్లు పడడంతో రాకపోకలు అంతరాయం లేకుండా చేస్తున్న గ్రామ స్థలు
  •  కల్వర్టు పై తాత్కాలికంగా మరమ్మత్తు లు చేసి మట్టిపోసిన స్థానిక ప్రజలు

నిడమనూరు,సెప్టెంబర్ 10(ప్రజాజ్యోతి) నిడమనూరు-బంకాపురం మధ్య కల్వర్టు తాత్కాలిక మరమ్మతులకేనా పరిమితం అయిందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ వంతెన ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు నిడమనూరు-బంకాపురం మధ్య కల్వర్టు(కావేజి)లో లెవల్ లో కల్వర్టునిర్మాణం చేప్పడం వల్లనే ఇలా ప్రతి ఏటా వరదలు రావడంతో  పూర్తిగా ద్వంసమై కుంగిపోయి  మధ్యలో కల్వర్టు శనివారం నిడమనూరు నుంచి బంకాపురం వాహనాలు వెళ్లకుండగా  మధ్యలో పోసిన మట్టి నీటీ ఉదృతికి  మట్టి కొట్టకపోతుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  నిడమనూరు-బంకాపురం మధ్య ఉన్న చిలకల వాగుపై  కల్వర్టు గత మూడు ఏళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు- సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కురిసిన వర్షాలకు వచ్చే వరద తాకిడికి  పూర్తిగా తాత్కాలికంగా మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది.

 రెండేళ్ల క్రితం గత నెలల్లో  కురిసిన వర్షాలకు,వంతెనపై నుంచి వెళ్లిన వరద తాకిడికి  నిడమనూరు మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ వరద నీటిలో పడి కొట్టుకుపోయి మృతిచెందింది.గత ఏడాది అదేవిధంగా  భార్య మృతిచెందిన విషయం జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో  కుటుంబం వీధిన పడింది .అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు కుమార్తెలు అనాధలైయ్యారు. ఇతంటి ప్రమాదం జరిగిన నేటి వరకు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేసి  ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకుంటున్నారు.

ఇలా ఇంకెన్నేళ్ళు తాత్కాలిక మరమ్మతులు చేస్తారు ఈ కల్వర్టు కి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు ఫలించలేదని పలువురు నాయకులు పేర్కొన్నారు.ప్రమాదకరంగా మారిన కల్వర్టుకి కొత్త నూతనవంతెన(బ్రిడ్జి)నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆ ప్రాంత ప్రజలు,పలుసార్లు అధికారులకు,రాజకీయ నాయకులకు,పలు వినతి పత్రాలు అందజేసిన గాని ఫలితం లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు.నేటికైనా ఈ ప్రయత్నం ఫలిచేనా మండల ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.