తెలంగాణా లో రజాకార్ల పాలన మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:02
Bike rally under the authority of Mahila Morcha in Telangana.

భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్15 ప్రజాజ్యోతి. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో కొనసాగుతుందని కెసిఆర్ మరో నిజంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి శ్రీమతి చందుపట్ల కీర్తి రెడ్డి  అన్నారు.గురువారం భూపాలపల్లి పట్టణ కేంద్రంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి  పాల్గొన్నారు ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజాకారుల నుండి విముక్తి పొందిన తెలంగాణ ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నాం విమోచన దినోత్సవం అధికారకంగా నిర్వహించకపోవడం నిరంకుశత్వానికి నిదర్శమని అన్నారు మజ్లిస్ పార్టీ చెప్పు చేతుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన కొనసాగిస్తున్నారని ఆమె విమర్శించారు. ఈసందర్భంగా జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వేశాల సత్యవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపడానికి ముందుకు వచ్చిందని తెలంగాణ ప్రాంతం ప్రజలు దీని గమనిస్తున్నారని ఇన్ని సంవత్సరాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆ తరహాలోను రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కేంద్ర పర్యటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు చేపట్టడం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం పాలన నుండి విముక్తి కోసం పోరాడిన మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ఈ నయానిజం కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దతించడం కోసం మహిళలందరూ శక్తి వంచన లేకుండా పనిచేస్తారని రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు కడారి మాలతి  ప్రధాన కార్యదర్శి బూర పధ్మ , సునిత ,బుక్యా భాగ్య , రేణుక, జంభోజు పధ్మ , కవిత ,రజిత ,లక్మీ ,హైమావతి,ప్రమీల ,వసంత వేన్నెల ,స్నేహ ,ఆశ తదితరులు పాల్గొన్నారు.