పోషకాహారంతో తల్లి బిడ్డకు మెరుగైన ఆరోగ్యం

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 09:59
Better health of mother and child with nutrition

ఫోటో రైటప్ ః పోషకాహారంపై బాలికలకు అవగాహన కల్పిస్తున్న ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఎస్ కే సైదాబేగం 

నిడమనూరు,సెప్టెంబర్22(ప్రజా జ్యోతి): తల్లి బిడ్డకు పోషకాహారం ఎంతో ఉపయోగపడుతుందని నిడమనూరు ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఎస్ కే సైదాబేగం  అన్నారు.గురువారం నిడమనూరు మండల కేంద్రంలోని కేజిబివి విధ్యాలయంలో కిశోర బాలికల రక్తహీనత బారీన పడకుండా తీసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి,మారుతివారిగూడెం,నారమ్మగూడెం,రేగులగడ్డ,బాలాపురం,వల్లభాపురం,బొక్కమంతుల పహాడ్,వెంగన్నగూడెం,గుంటికగూడెం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో పోషణమాస వారోత్సవాలను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కిశోర బాలికల రక్తహీనత బారీన పడకుండా తీసుకోవలసిన రక్తం అనేది శరీరంలో సరైన మోతాదులో ఉండాలి.పురుషుల్లో 12 - 18 లోపు ఉండాలి.అదేవిధంగా మహిళలలో 11-16 మధ్యలో ఉండాలి.పోషకాహారం తీసుకోకపోవడం ఎనిమియ వస్తుంది.అదేవిధంగా  తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి పోషణ మొదలవ్వాలని తెలిపారు. బిడ్డ పుట్టగానే ముర్రు పాలు పట్టించాలి. ఆరు నెలల వరకు తల్లిపాలు,టీకాలు క్రమంగా వేయించాలని సూచించారు.  ఆరు నెలల నిండిన తర్వాత అనుబంధ పోషకాహారము మొదలుపెట్టాలనిపేర్కొన్నారు.ఈకార్యక్రమంలోకస్తూర్భీపాఠశాలటీచర్స్ఇంచార్జిప్రిన్సిపాల్జ్యోతి,సుల్తాన,సైదమ్మ,అనిత,అశ్వని,నాగలక్ష్మి,సుశీల,
అంగన్వాడి టీచర్స్ రాజేశ్వరి, వహిద, పద్మజ, పద్మావతిఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.