క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర పేరుప్రఖ్యాతలను నలుదిశలా విశ్వవ్యాప్తం చెయ్యాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:08
The best talents of the state should be made universal in four directions by showing the best talent in sports

.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి).//.. అండర్ 19 బాలబాలికల 41 రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలను తొర్రూరు డివిజన్ కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ కే శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లతో కలిసి క్రీడలను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి& ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొర్రూరు ప్రాంతం క్రీడలకు పుట్టినిల్లుగా అడ్డాగా మారుతుందని, మినీ స్టేడియంకు స్థల కేటాయింపు చేయాలని, క్రీడలు వ్యక్తిగత అభివృద్ధికి సమాజ మార్పు ఎంతో దోహదపడతాయని, గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి తోటి ఆడి గెలవాలని, తెలంగాణ రాష్ట్ర పేరు ప్రఖ్యాతలను దేశవిదేశాల్లో క్రీడ ప్రతిభ చాటాలని మంత్రి అన్నారు.జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ క్రీడలతో 2 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించబడుతుందని చదువు తో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడాకారులకు క్రమశిక్షణ వాటి దారా అలవరుస్తుందని షూటింగ్ బాల్ చాంపియన్షిప్ను ఇదే ఉత్సాహంతో జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో 28 జిల్లాల నుండి 678 మంది క్రీడాకారులు,100 వ్యాయామ ఉపాధ్యాయులు కోచ్లు మేనేజర్లు పాల్గొంటున్నారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి నవంబర్ 13 14 15 లో మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లాలో జరగనున్న జాతీయస్థాయి షూటింగ్ బాటిల్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్పి లు క్రీడాకారులను పరిచయం చేసుకుని, బాల్ తో సర్వీస్ చేసి పోటీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర షూటింగ్ బాల్ అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్, డీఈవో అబ్దుల్ హై, ఆర్ డి ఓ రమేష్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, డి వై ఎస్ ఓ అనిల్, తహసిల్దార్ రాఘవరెడ్డి, బిందు శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ సురేందర్ రెడ్డి, సీతారాములు, అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.