వరి సాగులో రైతులకు తడి పొడి విధానం గూర్చి రామచంద్రపురం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది**

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 15:28
An awareness conference was held for farmers in Ramachandrapuram village regarding wet and dry system in rice cultivation.**

మద్దిరాల మండలంసెప్టెంబర్ 5(ప్రజా జ్యోతి)  మద్దిరాల మండల కేంద్రంలోని రామచంద్రాపురం గ్రామంలో ఈరోజు రైతులకు వరి సాగులో తడి పొడి విధానం గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వెలుగు ఎంకన్న మరియు ఎంపీటీసీ నాగవల్లి శ్రీలత శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ ఈ విధానాన్ని పాటించి వాతావరణ కాలుష్య కారకమైన మితిన్ వాయును తగ్గుదలవేసి ప్రపంచ పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాము అలాగే ఈ విధానంలో రైతుకు ఎలాంటి నష్టం లేదు పైగా వరిలో వేరు వ్యవస్థ బలంగా ఉండి చేను కింద పడకుండా ఉంటుంది పూర్తిగా తగ్గుతాయి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది పైగా రైతులకు ఎకరానికి 800 రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ఈ పద్ధతిని అవలంబించి విజయవంతం చేద్దాం అని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్స్ బూర్గుల బొందయ్య మరియు చామకూరి శరత్ రైతులు జ్ఞాన సుందర్ తెలుగు అంజయ్య 50 మంది రైతులు పాల్గొన్నారు