వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 14:55
Arrangements for Vinayaka immersion are complete
  •  నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న చోట ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి

 జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నల్గొండ,సెప్టెంబర్8(ప్రజాజ్యోతి) వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు నీటి ప్రభావం ఎక్కువ ఉన్నచోట ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.(సెప్టెంబర్ 9 )  శుక్రవారం వినాయక నిమజ్జనం కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.

ఎన్.ఎస్.పి.ఎడమ కాల్వ కు గండి పడి 14 వ మైలు వద్ద నీటి ప్రవాహం లేనందున వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే మండపాల నిర్వాహకులు నిడమ నూరు మండలం 14 వ మైలు వద్ద నిమజ్జనం చేయకుండా వల్లభ రావు చెరువు వద్ద,దండం పల్లి కెనాల్ లో నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

వల్లభ రావు చెరువు,దండం పల్లి కెనాల్ వద నిమజ్జనంకుక్రేన్లు,పోలీస్,రెవెన్యూ,మున్సిపల్,మత్స్య శాఖ,అర్ &బి శాఖల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.