దసరా ఉత్సవాల ఏర్పాట్లను ప్రారంభించిన పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం

Submitted by p naresh on Mon, 03/10/2022 - 13:14
Arrangements for Dussehra celebrations have started   Pura Chairman Edma Satyam

కల్వకుర్తి, అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి):   పట్టణ పరిధిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మహబూబ్ నగర్ రోడ్, మునిసిపల్ గ్రౌండ్స్ యందు ఆదివారం పుర చైర్మన్ ఎడ్మ సత్యం టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేదీ 05.10.2022 బుధవారం  రోజున విజయ దశమి వేడుకలు నివహించేందుకు పట్టణ ప్రజలకు అన్ని విధాలుగా అనువుగా వుండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. పట్టణ ప్రజలు మరియు పట్టణానికి విచ్చేసిన బంధువులు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వేడుకలు నిర్వహించే స్థలమునకు చేరుకోవాలని ఇక్కడ ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్, హహ్లాదకర కార్యములను వీక్షించాలని వారు కోరారు. అలాగే కార్యమనికి వచ్చే ప్రజలు తమ యొక్క వాహనాలు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైకి విచ్చలవిడిగా పెట్టకూడదని వాటిని రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు, ఉత్సవ కమిటీ, పుర అధికారులు మరియు పోలీస్ వారు తెలిపిన నిబంధనలు పాటించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయ దశమి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాచోటి శ్రీశైలం, కౌన్సిలర్లు బాలు నాయక్, గోరేటి శ్రీనివాస్, ఏజస్, సైదులు గౌడ్, భోజి రెడ్డి, మనోహర్ రెడ్డి, నాయకులు బృంగి ఆనంద్ కుమార్, రాఘవేందర్ గౌడ్, నూనె శ్రీనివాస్, కిషోర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాధవ రెడ్డి, నర్సింహ, వెంకటేష్ మరియు పుర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.