చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:36
Along with studies, excel in sports
  • ఎమ్మెల్యే గుర్క  జైపాల్ యాదవ్

కల్వకుర్తి సెప్టెంబర్ 9 ప్రజా జ్యోతి ; విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

 కల్వకుర్తి పట్టణంలోని బీసీ బాలికల గురుకుల లో మూడు రోజుల పాటు నిర్వహించిన బీసీ బాలికల గురుకుల ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఉమ్మడి జిల్లాలోని 13 బీసీ గురుకుల పాటశాల చెందిన 455 మంది క్రీడాకారిణిలు పాల్గొన్నరు.కబ్బడి  వాలి బాల్,ఖో ఖో,అథ్లెటిక్స్, చెస్, లాంగ్, హై జంప్ తదితర క్రీడా విభాగాల్లో రాణించి ప్రతిభ చాటారు.
 కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ యడ్మ సత్యం, షహీద్,RDO రాజేష్ కుమార్,RCO లింగయ్య, DCO వెంకట్ రెడ్డి,బీసీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు,పాటశాల ప్రిన్సిపాల్ సరిత, కల్వకుర్తి సీఐ సైదులువెంకట్ రెడ్డి,కల్వకుర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్ మనోహర్ రెడ్డి.