కార్మికులు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రైల్వే ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ సయ్యద్ వాసీం పాషా

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:52
Workers should be alert to hazards. Railway ELS Senior DEE Syed Wasim Pasha

కాజీపేట టౌన్‌, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి) ..//. రైల్వే కార్మికులు ప్రతి ఒక్కరు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ సయ్యద్ వాసీం పాషా సూచించారు.  శుక్రవారం కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే ఎలక్ట్రికల్ లోకోషేడ్లో డీఎల్ఎస్, ఈఎల్ఎస్ షేడ్ కార్మికులకు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం ఆదేశానుసారం సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఐదు రోజుల బెసిక్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీనియర్ డీఈఈ సయ్యద్ వాసీం పాషా హాజరై మాట్లాడుతూ షేడ్లో శిక్షణ పొందిన కార్మికులు ప్రమాధాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పలు అంశాలపై కార్మికులతో చర్చించి, ప్రమాధాలు జరగకుండా కార్మికులు జాగ్రత్తలు పాటించాలని తెలియచేశారు.