కాంగ్రెస్‌దే గెలుపు ఖాయం... లక్షకు పైగా జీవన్‌రెడ్డికి మెజారిటీ... అ మాజీ ఎమ్మెల్యేపై కేసులు తప్పవు... మూమ్మటికి అరవింద్‌ది మూడో స్థానం... సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం... "ప్రజాజ్యోతి" తో డీసీసీ అధ్యక్షుడు మానాలా మోహన్ రెడ్డి...

Submitted by SANJEEVAIAH on Thu, 09/05/2024 - 19:38
Photo

కాంగ్రెస్‌దే గెలుపు ఖాయం...

లక్షకు పైగా జీవన్‌రెడ్డికి మెజారిటీ...

అ మాజీ ఎమ్మెల్యేపై కేసులు తప్పవు...

మూమ్మటికి అరవింద్‌ది మూడో స్థానం...

మాజీ ఎంపి కవితపై అవినీతి ఆరోపణలు...

ప్రస్తుత ఎంపి ఏ ఒక్క పని చేయ్యలే... 

సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం...

ప్రజలే కాంగ్రెస్‌కు అండదండ...

"ప్రజాజ్యోతి" తో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి....

(నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రతినిధి - ప్రజాజ్యోతి - ` ఎడ్ల సంజీవ్‌)

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం మూమ్మటికి కాంగ్రెస్‌దే. పూర్వవైభవం తప్పకుండా వస్తుంది. ఏందుకంటే జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌రెడ్డిని నమ్ముతున్నారు. దీనిని తప్పుదారి పట్టించేందుకు బిజెపి మతరాజకీయాలు, బిఅర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. మాజీ ఎంపి కవిత అవినీతి అక్రమాలకు పాల్పడి జైలు పాలయ్యారు. ఇక ప్రస్తు ఎంపి అరవింద్‌ ఏం పని చేయ్యాలేక అవినీతి ఆరోపణలు లేవు. ఏదైనా పని చేస్తే కదా ఏదోకటి ఉండేది. అందుకే ఇప్పుడు బిజెపి మూడో స్థానానికి పరిమితం అవుతుంది. ఇదే నా చాలేంజ్‌. బిజెపి, బిఅర్‌ఎస్‌లు ప్రజలకు ఏం చేయకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి పార్లమెంట్‌ ఎన్నికల్లో పట్టం కడతారు అని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా గురువారం ‘‘ప్రజాజ్యోతి’’ ఉమ్మడి జిల్లా ప్రతినిధితో ముచ్చటించారు. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి హవా ఉంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్థానం ఏమిటీ.?
మానాల మోహన్‌రెడ్డి (ఎంఎంఆర్‌) : పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి హవా ఉందనేది ముమ్మటికి తప్పుడు ప్రచారం. నేను చాలేంజ్‌ చేస్తున్న బిజెపి నిజామాబాద్‌లో మూడో స్థానానికి పరిమితం అవుతుంది. ఏందుకంటే అయిదేళ్లలో అరవింద్‌ జిల్లాకు చేసింది ఏమి లేదు. మాటలు తప్ప చేతలు లేవు. అందుకే అ పార్టీ నేతలే అరవింద్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇక కార్యకర్తలకే అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. మోడీ చర్మీసపై ఆధారపడి ఉన్నారు. ఇక బిఅర్‌ఎస్‌ అంటే మాకు ఏ మాత్రం పోటీ కాదు. గత ఎన్నికల్లోనే మూడోసారి ప్రభుత్వం తీసుకువస్తామని చెప్పిన కేసీఅర్‌ను తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించారు. అది మీరే చూసారు. కాంగ్రెస్‌దే విజయం. 
ప్రజాజ్యోతి ప్రతినిధి : కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలతో నాయకులకు, కార్యకర్తలకు మద్య విభేదాలు ఉన్నాయనేది వాస్తవమే కదా.?
ఎం.ఎం.ఆర్‌. : కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు లేవు. ఒకవేళ ఉన్న వాటిని పరిష్కారించడంలో నాయకత్వం ముందుంది. ఇకపోతే కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్చ ఎక్కువ, దానికి తోడు భావస్వేచ్చ కూడా మాకు ఎక్కువే. మిగతా పార్టీల్లా కాదు. విభేదాలు ఎక్కడైనా ఏ పార్టీలోనైనా ఉంటాయి. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో ఏలాంటి విభేదాలు లేకుండా పని చేయడం వల్లే ఈరోజు మేం అధికారంలోకి వచ్చాం. కాబట్టి విభేదాలు అనేది తప్పుడు ప్రచారం మాత్రమే. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : నిజామాబాద్‌ అర్బన్‌లో విభేదాల వల్ల ఒటమి, బోధన్‌లో అతితక్కువ మెజారిటీతో బయట పడ్డారు కదా. 
ఎం.ఎం.ఆర్‌. : ఇది మూమ్మటికి అబద్దం. ఏలాంటి విభేదాలు లేకుండా పని చేయడం వల్లే గెలిచాం. నిజామాబాద్‌ అర్బన్‌లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది నామ మాత్రమే. షబ్బీర్‌అలీని అధిష్టానం నిర్ణయం మేరకే  అర్భన్‌లో పోటీ చేయడం వల్ల అందరం ఏకతాటిపై నిలబడి పని చేస్తేనే రెండో స్థానంలో ఉన్నాం. బోధన్‌లో సుదర్శన్‌రెడ్డి చేసిన అభివృద్ది తప్పా ఇంతవరకు ఈ పదేళ్లలో ఏం జరగలేదు. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : నిజామాబాద్‌ జిల్లాకు కాకుండా జగిత్యాల జిల్లాకు చెందిన జీవన్‌రెడ్డికి ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం.? అంటే జిల్లాలో అభ్యర్థి లేరనినా.?
ఎం.ఎం.ఆర్‌. : మీ ఆలోచననా లేక ఇతర పార్టీల తప్పుడు ప్రచారమా తెలియదు. జిల్లా ప్రాధాన్యత కాదు. పార్లమెంట్‌ నియోజవర్గం ముఖ్యం. పార్లమెంట్‌ పరిధిలోని జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి. అంతే స్థానికుడు అని తెలిపోయింది కదా. ఇక్కడ జిల్లా ప్రాధాన్యత ముఖ్యమనేది సరైంది కాదు. అయిన ఎంపిగా ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు కదా. అలాగే జీవన్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇంతకంటే అర్హత ఏం కావాలి. ప్రజలతో ఉండి ప్రజల కోసం పని చేసే వ్యక్తి జీవన్‌రెడ్డి అందుకే అయనకు పార్టీ టికెట్‌ కేటాయించింది. మచ్చలేని నాయకుడికి టికెట్‌ ఇచ్చాం కాబట్టి అయన గెలుస్తునడని, ఇతర పార్టీలు స్థానికత పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతే తప్పా అందులో ఏలాంటి నిజం లేదు. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : ఏ ఏ పార్టీల మద్య నిజామాబాద్‌ పార్లమెంట్‌లో పోటీ ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే మెజారిటీ ఏంత వస్తుంది.?
ఎం.ఎం.ఆర్‌. : కాంగ్రెస్‌కు బిఅర్‌ఎస్‌కు మాత్రమే పోటీ ఉంటుందని అనుకుంటున్నాం. బిజెపిది నిజామాబాద్‌ పార్లమెంట్‌లో మూడో స్థానం. ఏందుకంటే బిజెపిపై మక్కువ ఉన్నప్పటికి ఎంపిగా అరవింద్‌ జిల్లాకు చేసింది ఏమి లేదు. దానికి తోడు బాండ్‌ పేపర్‌ పేరుతో పసుపుబోర్డు పేరుతో రైతులను నమ్మించి మోసం చేసారు. ఎంపి అయ్యాక కూడా జిల్లాకు ఏం చేయలేకపోయారు. మతకలహాలు సృష్టించేలా మాట్లడటం, నిత్యం మోడీ జపం తప్పా అభివృద్ది చేయడంలో శూన్యం. అందుకే బిజెపిదే మూడో స్థానం మాత్రమే. ఇక కాంగ్రెస్‌కు 1.80 లక్షల నుంచి 2.40 లక్షల మెజారీటీ వస్తుంది. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : నిజామాబాద్‌ అర్బన్‌ ఇంచార్జి ఏవరు.? కొందరు మీ పార్టీ నాయకులు షబ్బీర్‌ అలీ మరి కొందరు మహేష్‌కుమార్‌ గౌడ్‌ అంటున్నారు. ఏది నిజం.?
ఎం.ఎం.ఆర్‌. : మీకు ఏవరు చెప్పారో కానీ ఇది తప్పుడు ప్రచారం మాత్రమే. నిజామాబాద్‌ అర్బన్‌ కో ఆర్డినేటర్‌గా షబ్బీర్‌అలీ కొనసాగుతున్నారు. ఇంతకు ముందే చెప్పాను. పార్టీ పెద్దల నిర్ణయంతోనే కో ఆర్డినేటర్ల నియమాకం జరుగుతుంది. కాబట్టి అర్బన్‌ నియోజక వర్గం కో ఆర్డినేటర్ షబ్బీర్ ఆలినే. మహేష్‌కుమార్‌ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే కదా. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : బిఅర్‌ఎస్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని, భూకబ్జాలు చేసిన వారికి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారు. దీనిపై పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. దీనికి మీ సమాధానం.?
ఎం.ఎం.ఆర్‌. : నిజంగా అవినీతి అక్రమాలకు పాల్పడిరది బిఅర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేలుగా పని చేసిన వారే. అది జీవన్‌రెడ్డి కావచుÊ,, గణేష్‌ గుప్తా కావచ్చు, బాజిరెడ్డి గోవర్థన్‌ కావచ్చు, షకీల్‌ కావచ్చు, ప్రశాంత్‌రెడ్డి కావచ్చు, కవిత కావచ్చు. కానీ కిందిస్థాయి నేతలు కాదు కదా. వారిని తప్పా మిగిలిన వారిని పార్టీలోకి తీసుకుంటాం. మీకు తెలుసో లేదో నిజామాబాద్‌ నగర మేయర్‌ భర్తపై కూడా మేం ఫిర్యాదు చేసాం. ఖచ్చితంగా ఎన్నికల అనంతరం విచారణ చేయిస్తాం. కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన ఓ మాజీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయిస్తాం. బలవంతంగా భూములను కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తాం. ఖచ్చితంగా అక్రమార్కుల అంతు చూస్తాం. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : జిల్లాలో కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.?
ఎం.ఎం.ఆర్‌. : ఇది కొంత వరకు మాత్రమే వాస్తవం. పాత వారి నాయకత్వంలోనే కొత్తవారితో పని చేయించుకుంటున్నాం. ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు ఉన్నాయి. కానీ చెప్పకోదగినంతవి కావు. అన్ని విధాలుగా సమాలోచనలు చేసి మాత్రమే పార్టీలోకి తీసుకుంటున్నాం. ఇందులో పార్టీ పెద్దలదే కీలక నిర్ణయం.

ప్రజాజ్యోతి ప్రతినిధి : డిసిసిబి పీఠం కైవసం చేసున్నప్పటికి బిఅర్‌ఎస్‌లో పలు పనులు చేసి ఆరోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తిని ఛైర్మన్‌ను చేసారు. బాల్కోండలో పలు పనులలో అవినీతి ఆరోపణలు చేసారని సదరు వ్యక్తిపై ఎంపి అరవింద్‌ నీతి అయోగ్‌లో ఫిర్యాదు చేసారు. కదా.? అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం వెనక ఉన్నది ఏవరు.?
ఎం.ఎం.ఆర్‌. : ముందు మీరోక విషయం గమనించాలి. డిసిసిబి ఛైర్మన్‌ గా చేసిన పోచారం భాస్కర్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డడని తోలగించి వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న రమేష్‌రెడ్డిని ఛైర్మన్‌ చేసాం. రమేష్‌రెడ్డి కాంట్రాక్టర్‌ మాత్రమే. అయన నాసిరకం పనులు చేసి, అక్రమాలకు పాల్పడిన అధికారికంగా చర్యలు ఉంటాయి. కాబట్టి కాంట్రాక్టర్‌ తప్పుడు పనులు చేయ్యరు. అక్కడ వాటిని అసలు కారణం స్థానిక ఎమ్మెల్యే మాత్రమే. దీనిపై మేం కూడా విచారణ చేయిస్తాం. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : కోనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులలో అవినీతి అక్రమాలు జరిగాయని , వాటిపై న్యాయ విచారణ చేయాలని ఆందోళన చేసిన డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఏందుకంటే ఇటీవల డీఎల్‌ఈసీలో సీఈవోలకు హెఆర్‌ పాలసీ అమలు చేయడంలో సీఈవోలకు పోస్టింగ్‌ ఇవ్వడంలో అంతర్యమేమిటీ.?
ఎం.ఎం.ఆర్‌. : అవును మేం ప్రతిపక్ష హోదాలో ఉండి రైతుల పక్షాన ఆందోళన చేసాం. ఫలితంగా షకీల్‌, అయన అనుచరుల రైస్‌మిల్లులలో వంద కోట్లకు పైగా అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇక సోసైటీలలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకునేలా ఆందోళన చేస్తాం. ఇక డీఎల్‌ఈసీలో జరిగిన వ్యవహారాలు నాకు తెలియవు. ఎన్నికల తర్వాత మా దృష్టికి తెస్తే తప్పకుండా వాటిపై కూడా జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చూస్తాం. సోసైటీలలో జరిగిన పోస్టింగ్‌లకు ఎన్నికల కోడ్‌తో సంబంధం లేకపోవచ్చు. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : ఎన్నికల తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి పదవి ఏవరికి వస్తుంది చెప్పగలరా.?
ఎం.ఎం.ఆర్‌. : అది నేను చెప్పలేను. అదంతా అధిష్టానం చేతిలో ఉంది. కానీ జిల్లాలో సీనియర్‌ నాయకులు పెద్దలు సుదర్శన్‌రెడ్డికి అవకాశం ఉండవచ్చు.  

ప్రజాజ్యోతి ప్రతినిధి : బాల్కోండ ఒక్క నియోజక వర్గం నుంచి అయిదుగురికి నామినేటేడ్‌ పోస్టులు రావడంపై మీ అభిప్రాయం.?
ఎం.ఎం.ఆర్‌. : పని చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. జిల్లాలో మరో ముగ్గురికి నామినేటేడ్‌ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక బాల్కోండలో వచ్చిన పోస్టులు ఒక నియోజక వర్గం అని కాదు, వారిలో నేను ఉన్నాను. ఒకోకరు ఒకోక స్థాయిలో పని చేయడం వల్లే పదవులు వస్తాయి. 
ప్రజాజ్యోతి ప్రతినిధి : మీకు నామినేటేడ్‌ పోస్టు వచ్చింది కదా. నిజామాబాద్‌ డీసీసీ పీఠం ఎవరికి ఇస్తారో చేప్పగలరా.?
ఎం.ఎం.ఆర్‌. : అది నేను చెప్పలేను. వాస్తవానికి నాకే మరో రెండున్నరేళ్ల పాటు ఉండే అవకాశం ఉంది. కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ త్వరలో కొత్త డీసీసీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. దాని కోసం జిల్లాలో ఓ ముగ్గురు బరిలో ఉన్నారు. పార్టీ నిర్ణయం ఏదైనా అందరం దానిని పాటిస్తాం అంతే. ఏవరు అనేది నేను కూడా చెప్పలేను. 

ప్రజాజ్యోతి ప్రతినిధి : నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో రెడ్డి సామాజిక వర్గం మాత్రమే కీలకమైన పోస్టుల్లో ఉంటున్నారు. వారికి మాత్రమే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. 
ఎం.ఎం.ఆర్‌. : ఇది కరెక్టు కాదు. ఇంతకు ముందే చెప్పాను. పని చేసిన వారికి పార్టీలో అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌లో ఉన్న సామాజిక న్యాయం ఏ పార్టీలో లేదు, ఉండదు. ఎమ్మెల్యే టికెట్లలో ఉది కొంత మేరకు ఉన్నప్పటికి అ తర్వాత అన్ని వర్గాలకు సమన్యాయం చేసాం. అందుకు బిసి సామాజిక వర్గం అయిన మహేష్‌కుమార్‌ గౌడ్‌కు ఎమ్మెల్సీ, మైనారిటీ నేత అయిన షబ్బీర్‌ అలీకి ప్రభుత్వ సలహాదారు, ఈరవత్రి అనిల్‌, కాసుల బాలరాజులకు రాష్ట్ర స్థాయి నామినేటేడ్‌ పోస్టులు ఇచ్చాం. ఇదే కాంగ్రెస్‌ పార్టీలో సమన్యాయం.