పూలనే పూజించే సాంప్రదాయం మనది చీరల పంపిణీ లో చీఫ్ విప్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:37
We have a tradition of worshiping flowers Chief whip in distribution of sarees

కాజీపేట, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి)..//..  కాజిపేట్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో 47,62,63 డివిజన్లకు చెందిన మహిళలకు బతుకమ్మ కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను ఆయా డివిజన్ల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. అనంతరం చీఫ్ విప్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం పూలను పూజకు ఉపయోగించే సంప్రదాయం ఉంటే కానీ తెలంగాణలో పూలనే పూజించే సంప్రదాయం మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చేనేత రంగానికి చేయుతనిస్తూ బతుకమ్మ చీరలను తయారుచేసే బాధ్యతను అప్పజెప్పి వారికి ఉపాధి అందించడం జరిగిందన్నారు. అనంతరం మహిళమణులకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సుంచు కృష్ణ, మాజీ కూడా చైర్మన్ యాదవ రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జోనా, తెరాస నాయకులు సుంచు అశోక్, డివిజన్ అధ్యక్షులు రంజిత్, వినయ్,మహమూద్ తదితరులు పాల్గొన్నారు.