
దేశవ్యాప్తంగా ఎఎస్పీ పోటీ
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఆజాద్ సమాజ్ పార్టీ ఐఎస్పి పోటీ చేస్తుందని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళుతున్న ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏఎస్పీ పార్టీని ప్రారంభిస్తామని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో పోటీలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలలో దళిత ఎస్సి, ఎస్టీ బీసీ మైనార్టీలను మరింత చైతన్యం చేసి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16న నిజామాబాద్ జిల్లాలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జరిగిన భారత రాజ్యాంగం సామాజిక న్యాయం సవాళ్లు అనే అంశంపై జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. అలాగే 17న హైదరాబాదులోని వేముల రోహిత్ వర్ధంతి సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. అతి త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పాల్గొంటామని భీమ్ ఆర్మీ చీఫ్ డాక్టర్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
- 16 views