నేడే ఓటరు తీర్పు... ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు... ఏడు అసేంబ్లీలు... 1808 పోలింగ్‌ కేంద్రాలు... 17.05 లక్షల మంది ఓటర్లు... 8.06 లక్షల పురుషులు... 8.99 లక్షల స్త్రీలు... 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు...

Submitted by SANJEEVAIAH on Sun, 12/05/2024 - 19:46
Photo

నేడే ఓటరు తీర్పు...
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు...
ఏడు అసేంబ్లీలు... 1808 పోలింగ్‌ కేంద్రాలు...
17.05 లక్షల మంది ఓటర్లు...
8.06 లక్షల పురుషులు... 8.99 లక్షల స్త్రీలు...
3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు...
నిబంధనాలు అతిక్రమిస్తే చర్యలు : కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు...
గీత దాటితే కేసులే : సిపి సింగవార్‌ కల్మేశ్వర్‌...

(నిజామాబాద్‌ ప్రతినిధి ` ప్రజాజ్యోతి ` ఎడ్ల సంజీవ్‌)

నేడు జరిగే నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 29 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కీలకమైన కాంగ్రెస్‌, బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీల మధ్యనే పోటీ ఉండటం విశేషం. ఈ ఎన్నికల నిర్వహణకు 1808 పోలింగ్‌ కేంద్రాల్లో 17 లక్షల 4 వేల 867 ఓట్లు ఉండగా స్త్రీలు 8లక్షల 98 వేల 647 కాగా పురుషులు 8లక్షల 6 వేల 130 మందితో పాటు 90 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా 82 వేల 517 మంది స్త్రీలు అత్యధికంగా ఉన్నారు. వీరే ప్రధానంగా గెలుపు ఒటములను నిర్ణయించేది. ఇదిలా ఉంటే అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్‌లో 3,04,317, అత్యల్పంగా ఆర్మూర్‌లో 2,12,145 మంది ఒటర్లు ఉన్నారు. 

మహిళలే కీలకం...
నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పురుషుల కంటే మహిళల ఒటర్లు 82వేల 517 మంది ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్‌లో మహిళలు అత్యధికంగా ఉండగా 1,57,519, అత్యల్పంగా ఆర్మూర్‌లో 1,13,401 మహిళ ఓట్లు ఉన్నాయి. వీటితో పాటు వరుసగా నిజామాబాద్‌ రూరల్‌లో 1,36,818 మంది, కోరుట్లలో 1,28,863, జగిత్యాల 1,23,259, బాల్కోండ 1,22,068, బోధన్‌ 1,16,719 మహిళ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 8,98,647 మహిళ ఒట్లు కీలకంగా మారాయి. 

స్థానికత దెబ్బ తీస్తుందా.?
నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు శాసన సభ నియోజక వర్గాలు ఉండగా నిజామాబాద్‌ జిల్లాలో అయిదు నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కోండ నియోజక వర్గాలున్నాయి. జగిత్యాల జిల్లా పరిధిలో జగిత్యాల, కోరుట్ల నియోజక వర్గాలు ఉన్నాయి. జగిత్యాల, కోరుట్ల నియోజక వర్గాలలో కలిపి 4,81,924 ఓట్లు ఉన్నాయి. జగిత్యాలలో 113392 మందిపురుషులు, 123259 స్త్రీలు, ఇతరులు 24 మంది ఉండగా  పురుషుల కంటే 9,867 స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అలాగే కోరుట్లలో 116382 పురుషులు, 128863 స్త్రీలు, 4 ఇతరులు ఉన్నారు. కాగా పురుషుల కంటే కోరుట్లలో స్త్రీలు 12,481 మంది ఎక్కువగా ఉన్నారు. మొత్తం మీద  22,348 మంది స్త్రీ ఒటర్లు జగిత్యాల జిల్లా పరిధిలో ఎక్కువగా ఉన్నారు. వీరే స్థానికతపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ప్రచారంలో ఉంది. ఈ ఓట్లు స్థానికత ఫిలింగ్‌లో పని చేస్తే జగిత్యాలకు 
చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి తాటపర్తి జీవన్‌రెడ్డికి అనుకూలంగా ఉంటాయనే ప్రచారం ఉంది. ఈ ఓట్లు ఇప్పుడు అటు బిజెపికి, ఇటు బిఅర్‌ఎస్‌కు సవాల్‌గా మాచాయి. 

త్రిముఖం... వ్యూహాం ప్రతివ్యూహం..
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో త్రిముఖ పోరు ఖాయం అయింది. నిన్నటి వరకు పోటాపోటీగా ప్రచారం చేసి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇక మిగిలింది నేడు పోలింగ్‌. పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలు సీరా చుక్కతో నేడు తమ తీర్పు చెప్పేందుకు సిద్దం అయ్యారు. అయితే బిజెపి ఇప్పటికే హిందు మతం పేరుతో మోడీ నాయకత్వాన్ని కోరుకుంటు ప్రచారం చేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలతో ప్రచారం చేస్తు మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. మద్యేమార్గంగా బిఅర్‌ఎస్‌ తెలంగాణ పదేళ్ల పాలన, అభివృద్ది, సంక్షేమ ఫలాలపై ప్రచారం చేసుకుంది. ప్రచారం ముగిసి ఇప్పుడు వ్యూహాం, ప్రతి వ్యూహాం పన్నుతో ఓటర్లను మెప్పించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. నేడు ఓటరు తీర్పును ఈవీఎంలలో రిజర్వు చేయనున్నారు. 

మైనారిటీలపైనే ఆశలు...
నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మైనారిటీల ఓట్లు కీలకంగా మారాయి. వీరితో పాటు సామాజిక కోణంలో మున్నూరుకాపు, పద్మశాలీల ఓట్లను సైతం రాబట్టుకునే పనిలో మూడు పార్టీలు ప్రయత్నాలు చేసాయి. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు సుమారు 4 లక్షల మేరకు ఉంటాయనే అంచనాతో కాంగ్రెస్‌, బిఅర్‌ఎస్‌లు పోటాపోటీగా ప్రచారం చేసారు. ఈ ఓట్లే లక్ష్యంగా రెండు పార్టీలు పోటీపడి మరి ప్రచారం చేసారు. బిజెపి వీరికి దూరంగా ఉంది. మైనారిటీలు కాంగ్రెస్‌ వైపునకు ఉంటే బిజెపికి ప్రమాదం తప్పదు. కానీ రెండుగా చీలితే పరోక్షంగా బిజెపికి లాభం చేకూరనుంది. దీంతో అందరి దృష్టి, అంచనాలు మైనారిటీల ఓట్లపైనే ఉంది. ఇక బిఅర్‌ఎస్‌, బిజెపి అభ్యర్థులు ఇద్దరు మున్నూరు కాపులు కావడంతో ఈ ఓట్లు రెండు వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇద్దరిలో ఎవరికి మెజారిటీ మున్నూరుకాపులు మొగ్గు చూపుతారో మరి. ఇక పద్మశాలీలు కీలకంగా మారారు. ఇప్పటికే మూడు పార్టీలు పోటాపోటీగా వీరితో సమావేశాలు, సభలు ఏర్పాటు చేసాయి. కానీ వీరి ఒటు ఎటువైపునకు ఉంటుందనేది అంతుచిక్కడం లేదు. 

వ్యతిరేకత... మోడీ ఫోబియా...
నిజామాబాద్‌ పార్లమెంట్‌లో బిజెపి నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపి ధర్మపురి అరవింద్‌పై ఇంటా బయట వ్యతిరేకగ ఉంది. అయిదేళ్లలో ఏలాంటి అభివృద్ది చేయలేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దానికి తోడు పార్టీలోనూ వ్యతిరేకత, సీనియర్‌ నాయకులు దూరంగా ఉండటం గమనర్హం. పసుపు బోర్డు, షుగర్‌ ఫ్యాక్టరీ హామిలు సమస్యగా మారాయి. దీంతో బిజెపి నేతలు మోడీ ఫోబియాపై ఆశలు పెంచుకున్నారు. దేశవ్యాప్తంగా మోడీ జపం నడవడం, హిందుమతం పరిరక్షణ పేరుతో జరుగుతున్న ప్రచారమే గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. 
బిఅర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, స్థానిక నాయకత్వంతో పాటు పార్టీ క్యాడర్‌ను నమ్ముకుని పని చేస్తున్నారు. అలాగే అయా నియోజక వర్గాలలో పోటీ చేసిన అనుభవం, సీనియర్‌ నాయకుడిగా జిల్లాలో అందరికి సుపరిచితుడు కావడం కలిసి వచ్చే ఆంశంగా ఉంది. ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌లో ఎమ్మెల్యేగా పని చేయడమే కాకుండా మున్నూరుకాపు సామాజిక వర్గం, కలివిడితనంతో సామాజికంగా అన్ని కుల, వర్గాల వారి మద్దతు ఉంది. దీనితోడు పార్టీ క్యాడర్‌తో గెలుపు ఖాయం అనే దీమాలో ఉన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా అందరికి సుపరిచితుడే. అలాగే సీనియర్‌ నాయకుడు కావడంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, క్యాడర్‌పై ఆశలు పెట్టుకోని పని చేస్తున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో స్థానికతతో బయట పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరికి వారే త్రిముఖ పోరులో ఉన్నప్పటికి నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి మరి. 

అతిక్రమిస్తే చర్యలు : జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హనుమంత్‌...

ఎన్నికల నియమ నిబంధనాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హనుమంత్‌ తెలిపారు. ఇప్పటికే అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్దల ఏర్పాట్లు పూర్తి చేసామని, ఎన్నికల సిబ్బంది గానీ, అయా పార్టీల అభ్యర్థులు, నాయకులు నిబంధనాలను అతిక్రమిస్తే ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనాలకు లోబడి పని చేయాలని సూచించారు. 

కేసులు తప్పవు : సీపీ కల్మేశ్వర్‌...

ఎన్నికల నిర్వహణలో కమిఫన్‌ నిబంధనాలను అతిక్రమిస్తే పోలీసు కేసులు తప్పవని నిజామాబాద్‌ సీపీ సింగన్‌వార్‌ కల్మేశ్వర్‌ తెలిపారు. ఇప్పటికే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తు పార్టీ అభ్యర్ధులకు అన్ని విధాలుగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద, అలాగే జిల్లా వ్యాప్తంగా 144 సేక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనాలను అతిక్రమించిన ఏలాంటి అసాంఫీుక కార్యకలపాలకు పాల్పడిన అల్లర్లు చేయాలనే ఉద్దేశ్యంతో పని చేసిన పోలీసు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

ఇవి ఓటర్ల లెక్కలు...
నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజక వర్గాలలో ఓటర్ల నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ఆర్మూర్‌ నియోజకవర్గంలో నమోదు అయ్యారు. వీరిలో మహిళ ఓటర్లే కీలకంగా మారారు.
``````````````````````````````````````````````````
నియోజకవర్గం...       ` - పురుషులు - స్త్రీలు      - ఆదర్స్‌  - మొత్తం     - పో.సెంటర్స్‌ 
``````````````````````````````````````````````````
ఆర్మూర్‌            98737   `113401 `7      `212145  `217
బోధన్‌           ` 106372 `116719 `5      `223096  `246
నిజామాబాద్‌ అర్బన్‌ ` 146757 `157519 `41     `304317  `289
నిజామాబాద్‌ రూరల్‌` 119769 `136818 `6      `256593  `293
బాల్కోండ           ` 104721 `122068 `3     `226792  `247
కోరుట్ల           ` 116382 `128863 `4      `245249  `262
జగిత్యాల           ` 113392 `123259 `24      `236675  `254
``````````````````````````````````````````````````
మొత్తం           ` 806130 `898647 `90     `1704867  `1808
``````````````````````````````````````````````````