భావితరాల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మూలం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:45
Teachers are the source of the future of the children    Nakirekal MLA Chirumurthy Lingaiah


నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవం

నల్లగొండ సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి)../../ భావితరాల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మూలమని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో 2022వ సంవత్సరానికిగాను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు బుధవారం నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సంధర్భంగా ఉత్తమ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు ఆయన సన్మానం చేసి మాట్లాడారు.చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ రేపటి పౌరులుగా విద్యార్థులను, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.విద్యార్థి, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని అన్నారు. ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి అండగా నిలిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఉపాధ్యాయులు వారి వారి కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా,ఎవరూ ఊహించని రీతిలో పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని ఆయన స్పష్టం చేశారు..