సహకార బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Submitted by p naresh on Sat, 01/10/2022 - 13:02
Take advantage of Co-operative Bank services
  • నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ షణ్ముఖ చారి
  • బ్యాంకురుణాలను సకాలంలో చెల్లించాలి
  • పిఎసిఎస్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి

కల్వకుర్తి, సెప్టెంబర్30(ప్రజాజ్యోతి):  రైతులకు మెరుగైన వ్యవసాయ సహకారం అందిచెందుంకు డీసీసీబీ బ్యాంక్ ఎప్పుడు ముందుంటుందని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్   షణ్ముఖ చారి పేర్కోన్నారు శుక్రవారం  కల్వకుర్తి పి ఏ సి ఎస్ డి సి సి బి బ్యాంక్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. యుటిఎఫ్ సమావేశ మందిరం లో    కల్వకుర్తి పిఎసిఎస్ చైర్మెన్ తలసాని జనార్ధన్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీజీఎం షణ్ముఖ చారీ, డీసీసీబీ సీఈవో లక్ష్మయ్య  పాల్గొని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు డీసీసీబీ వంక ద్వారా తీసుకున్న  స్వల్ప దీర్ఘ కాలిక రుణాలను సకాలంలో చెల్లించు బ్యాంక్ లకు సహకరించాలని కోరారు.. రైతులు వారికి  అవసరమైన దీర్ఘ కాలిక ఋణాలు మరియు పంట ఋణాలు వాటిని సకాలంలో చెల్లించక పోతే కలిగే నష్టాలు విది విధానాలు రైతులు వివరించారు. బ్యాంక్ మరియు సొసైటీలో డిపాజిట్ చేసిన కలిగే లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్యామ్ సుందర్ డైరెక్టర్లు రాము నాయక్.దేశం పుల్లా రెడ్డి. ఫరీద్. రైతు సమితి అధ్యక్షుడు వర్కాళ భాస్కర్ రెడ్డి కల్వకుర్తి  మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు కుంభం బీమయ్య గొర్రె కాపరుల సంఘం అధ్యక్షుడు పాల శ్రీనివాస్ యాదవ్ మునిసిపల్ కౌన్సిలర్స్ యడమ బోజి రెడ్డి చైతన్య కిషోర్ రెడ్డి నూనె యాదమ్మ శ్రీను యాదవ్. సీఈవో వెంకట్ రెడ్డి రైతులు రైతు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.