సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు పై సమీక్ష

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 10:51
A review of Saddula Bathukamma arrangements

నల్లగొండ అక్టోబర్ 02(ప్రజాజ్యోతి)./...నేడు(సోమవారం) జరుగనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు బతుకమ్మ లు  ఆడి  నిమజ్జనం కు తగిన ఏర్పాట్లు చేయాలని అర్.డి. ఓ జగన్నాథ రావు అధికారులను కోరారు.ఆదివారం సాయంత్రం అర్.డి. ఓ కార్యాలయం లో రెవెన్యూ,పోలీస్, మహిళా,శిశు సంక్షేమ శాఖ, మెప్మా,,విద్యా శాఖ,మున్సిపల్ అధికారులతో సద్దుల బతుకమ్మ సందర్భంగా వల్లభ రావు చెరువు వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని,మహిళలు బతుకమ్మ లతో వచ్చేందుకు స్కూల్ బస్ లు ఏర్పాటు చేయాలని, డి. ఈ ఓ.ను కోరారు .వల్లభ రావు చెరువు వద్ద వేదిక ,త్రాగు నీరు,పారి శుద్యం,లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. మెప్మా,మహిళ శిశు సంక్షేమ శాఖలు,ఆన్ని శాఖల ఉద్యోగ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని,అన్ని శాఖలు సమన్వయం తో పని చేసి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశం లో డి.ఎస్.పి.నర్సింహ రెడ్డి, డి. ఈ. ఓ బిక్ష పతి,మహిళ,శిశు సంక్షేమ శాఖ పి డి.సుభద్ర తదితరులు పాల్గొన్నారు.