రాహుల్ గాంధీ భారత్ జోడి యాత్ర తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ప్రత్యేక కధనం.

Submitted by Praneeth Kumar on Sat, 22/10/2022 - 18:59
Rahul Gandhi's Bharat Jodi Yatra is a special story at a time when he is entering Telangana.

మనుసుల్ని గెలుస్తాడా..??
ఢిల్లీనీ జయిస్తాడా..!!
◆ రాహుల్ గాంధీ భారత్ జోడి యాత్ర తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ప్రత్యేక కధనం.

ఖమ్మం అర్బన్, అక్టోబర్ 22, ప్రజాజ్యోతి  

ఒకరోచ్చారు కటిక పేదనన్నాడు, టీ అమ్ముకునే వ్యక్తి అన్నారు, ప్రజల్ని ప్రేమిస్తానన్నాడు, దేశమే సర్వస్వమన్నాడ, సమర్థతతో సవారీ చేస్తా అన్నాడు, నమ్మించాడు, నమ్మకం కలిగేలా ప్రవర్తించాడు ప్రచారంతో ముంచెత్తాడు. కన్న తల్లి మీద ఒట్టేశాడు, అభివృద్ధి ధ్యేయమన్నాడు, అనాధలకు అండగా ఉంటా అన్నాడు, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేస్తా అన్నాడు, నెత్తిన పెట్టుకున్నాక తెలిసింది 'మైండ్ గుండు సున్నని' ఇంటర్నేషనల్ ఎలైట్ బ్రాండ్స్ ఎంజాయ్ చేసేందుకే కుర్చీ ఎక్కాడేమో అనిపిస్తాడు, నటనతో నెట్టుకొస్తాడు. అబద్ధానికి తోబుట్టువు, నిబద్ధానికి నిత్యశత్రువు. చేతగానితనంతో దేశాన్ని ముంచేశాడు. రాజకీయం కోసం పాతళంతో పోటీ పడే భేతాళుడా అతను, జనం తేరుకునేలోపే రాక్షస ప్రచారంతో కమ్మేశాడు. దేశాన్ని అయినకాడికి అమ్మేశాడు, ప్రశ్నించిన వాళ్ల పై విషం చిమ్మేశాడు. దేశాన్ని నిలువునా ముంచి 20 ఏళ్లు వెనక్కి నెట్టేశాడు. నేను పేదోణ్ని అని చేసిన ఫేక్ ప్రచారాన్ని నమ్మినందుకు ఇదంతా ఓ జాతి, దేశం చెల్లిస్తున్న మూల్యం ఇదే అసలు బొమ్మ.

◆ మరోవైపు చూద్దాం..!!
ఓ శ్రీమంతుడున్నాడు, ఐశ్వర్యంలో పుట్టిపెరిగినా దర్పం తెలియదు. జుబ్బా పైజమాలో నిబ్బరానికి నిదర్శనం అతను. ఐదేళ్ల అధికారాన్ని, ప్రధాని పదవినీ అవలీలగా వదిలేసిన వాడు. భోగాలను వదిలి అభాగ్యుల్ని ఆలింగనం చేసుకుంటాడు. అబద్ధానికి ఆమడ దూరం, వేల కిలో మీటర్లను జనం అడుగులతో దాటుతున్నాడు, రాటుదేలుతున్నాడు. మీడియాతో మమేకమవుతాడు ప్రశ్నలు ఏమైనా ఉంటే సంధించండి అని ధైర్యంగా చెప్తాడు. ఆ నవ్వే స్వచ్ఛత, ఆ మాటే అవగాహన. పదవీకాంక్ష అంటని ఆ నడతే దేశానికి మార్పును నేర్పుతోంది. నిద్రలేని నిమిళిత నేత్రాలతో దేశం చూస్తున్న కొత్త పొద్దు ఇది. బురద ముంచుతున్న వేళ స్వచ్ఛత పలకరిస్తున్న తరుణం ఇది. ఇంత చెప్పుకున్నాక, ఒక అనుమానం రావొచ్చు. ఈ సునిశిత ఆలోచనాపరుడు ఆ భేతాళుణ్ని ఢీ కొట్టగలడా అని,  ఎస్ గుర్రం ఎగరావచ్చు మాంత్రికుణ్ని మట్టుబెట్టిన తోటరాముడు ఏమంత బలవంతుడని.
బట్టలు ఇస్త్రీ నలగకుండా, ఒళ్ళు అలవకుండా, చెమట పట్టకుండా, హాయిగా ఏసీలో సేద తీరుతూ, మూడు పూటలా కడుపునిండా తిని, కాలు మీద కాలేసుకుని కూర్చుని, కంటి నిండా నిద్రపోయి, దర్జాగా, రాజభోగం అనుభవిస్తూ జీవితాన్ని ఆస్వాదించక, ఇలా రోడ్ల వెంట, ఎండ, వాన, దూళి దుమ్ము, చెమట, అలుపు, ఆయాసం, అనకుండా ఎందుకోసం, దేనికోసం తిరుగుతున్నావు రాహుల్..?? నాన్నమ్మను, నాన్నను పోగొట్టుకున్నా ఇంకా బుద్ధి రాలేదా రాహుల్. ఆకాశానంటుతున్న ఆకలికేకల నుండి, అమెరికా డాలర్ దాటికి అతలాకుతలమవుతున్న రూపాయి రోగిష్టి బతుకు దాకా, ఏ విషయం మీద అడిగినా అక్షరం పొల్లు పోకుండా అనర్గళంగా మాట్లాడే, నీ వాగ్దాటికి, వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయి, కెమెరా లంటే మోజుపడి, విలేకరులు అంటే భయపడి, ప్రెస్ మీట్లంటే గుండెలు అదిరి చచ్చే వాళ్లను చూసి నవ్వుకోవడం తప్ప చేసేదేముంది రాహుల్. నిన్ను పప్పు అన్న వాళ్ళ మెదడుకు పట్టిన తుప్పు వదలగొట్టేలా ఇలా నువ్వు జనం మధ్య ఉండాలి రాహుల్. ఆ జనం నీ శ్రమను గుర్తించే రోజు వస్తుంది రాహుల్. దేశంలో నిన్ను మించిన పిచ్చివాడు లేడు రాహుల్. ఈ దేశ ప్రజలు అంటే నీకు ఎందుకంత పిచ్చి. మా బోటి వాళ్లు తరతరాలుగా ఆస్తులు వెనకేసుకుంటుంటే, మీరు తరతరాలుగా ప్రజల పట్ల ప్రేమను వెనుకేసుకుంటున్నారు. ఈ పిచ్చి ప్రేమతో ఏం సాధిస్తారు రాహుల్. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా, చిరకాలంగా నిలిచిపోతారు అంతే కదా. నీ పలకరింపు ప్రజల అడుగంటిన ఆశలకు కొత్త ఊపిరిలూదుతుంది, నీ చిరునవ్వు పసి పిల్లాడిలా ఏ కల్మషం లేకుండా గుండె గూటికి ఉత్సవ సంబరాన్ని రుచి చూపిస్తుంది. నీ కరాచలనం కష్టాలను, కన్నీళ్లను దూరం చేసే కరదీపిక కానుంది. నీ నడక నిరాశను పారదోలి మా బతుకులలో వసంతాన్ని మోసుకొచ్చే ఉషస్సులా ఉంది. నీ పక్కన నిల్చోవడం అంటే తరతరాలుగా రక్త మాంసాలను దేశానికి అర్పించిన మహాత్ముల మహనీయుల నీడలో నడిచినట్టే రోడ్లెమ్మట నిన్ను చూస్తుంటే గ్యారేజీకి తరలిపోతున్న దేశానికి రిపేర్ చేసేయువ, నవ మెకానిక్ లా కనిపిస్తున్నావు రాహుల్. అందరూ నిన్ను కలవలేకపోవచ్చు రాహుల్ నీ ఆశలను, ఆకాంక్షలను దేశ ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు నువ్వు పడే శ్రమను నేను అర్థం చేసుకోగలరు రాహుల్. అక్షరమై, కవిత్వమై ఒకరిద్దరి రాతి గుండెలనైనా కదిలించగలము, ఆలోచింపజేయగలను రాహుల్.