సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్

Submitted by Degala shankar on Sat, 24/09/2022 - 13:13
Quality food should be provided to students in welfare hostels  District Collector Sikthapatnaik

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 23, (ప్రజా జ్యోతి),,..///సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు వారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం చాందా గ్రామ సమీపంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన సరుకులను, కిచెన్ గదిలోకి వెళ్లి పరిశీలించారు. సరుకులు చంద్రవందరంగా పడేసి ఉండడం వల్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు, భోజన విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం, శుద్ధమైన తాగునీరు, అందించాలని వార్డెన్లను ఆదేశించారు. వసతి గృహాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారం కనపడకుండా స్థానిక పారిశుద్ధ్య, సిబ్బంది ద్వారా శుభ్రం చేయించుకోవాలని, సూచించారు. అనంతరం స్టోర్ రూమ్ లోని బియ్యం, పప్పులు, గుడ్లు, కూరగాయలు తదితర సామాగ్రిలను పరిశీలించారు. స్టోర్ రూమ్ లోసరుకులను నేల మీద చిందర వందరగా పడేసి ఉండడం వల్ల సిబ్బందిపై కలేక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సరుకులను నేల మీద కాకుండా బెంచీల మీద ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే అన్నంలో ఎలాంటి పురుగులు రాకుండా బియ్యం శుభ్రం చేయాలని అన్నారు.

విద్యార్థులకు వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు, వారి పరిధిలోని వసతి గృహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, విద్యార్థులు అనారోగ్య భారిన పడినప్పుడు వెంటనే వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్లి చికిత్సలు ఇప్పించాలని అన్నారు. స్టోర్ రూమ్ లోని కాలం చెల్లిన సరుకులను, ఆయా ఏజెన్సీలకు తిరిగి అప్పగించాలని అన్నారు. మరుగుదొడ్లను, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. ఆయా పాఠశాలలో వండిన అన్నం, పప్పు,గుడ్లు, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు భోజన అందించే ముందు ఫుడ్ కమిటీ భోజనాలను రుచి చూడాలని, ఆ రోజు భోజనం రుచి చూసిన వారి పేర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు. విద్యార్థులు దసరా సెలవుల సందర్భంగా వారి ఇండ్లకు వెళ్లి తిరిగి పాఠశాల ప్రారంభం రోజున హాజరయ్యే విధంగా పాఠశాల యజమాన్యం విద్యార్థుల పోషకులకు తెలియజేయాలని అన్నారు. సంక్షేమ వసతి గృహాలలో అధికారులు పర్యటించి, విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాలను పరిశీలించాలని చెప్పారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని సునీత కుమారి, మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు, వార్డెన్ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.