ప్రేమన్న గిదేమి తిరన్న... మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీలో మరి(ఇ)ది... సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటో...

Submitted by SANJEEVAIAH on Sat, 11/02/2023 - 19:23
ఫోటో

ప్రేమన్న గిదేం తిరన్న.. 

మున్సిపల్ చైర్ పర్సన్ చైర్ లో మరి(ఇ)ది

వదిన కుర్చీలో మరిది

ఆర్మూర్ సోషల్ మీడియా లో హల్ చల్

(నిజామాబాద్ - ప్రజాజ్యోతి) 

ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత చైర్ లో ఆమె మరిది పండిత్ ప్రేమ్ కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. పండిత్ ప్రేమ్ చైర్ పర్సన్ కు కుర్చీలో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోకి తోడు ఎమ్మేల్యే జీవన్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత ఆమె భర్త పండిత్ పవన్, పండిత్ ప్రేమ్ లు దిగిన ఫోటోను జత చేసి వైరల్ చేస్తున్నారు. జరిగిన సంఘటన ఎప్పడిదో కానీ విషయం ఇప్పుడు మాత్రం ఫోటో హల్ చల్ చేయడంతో ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటీలో ఏమి జరుగుతుంది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. భార్య కుర్చీలో భర్త, మరిది పెత్తనంపై పట్టణ ప్రజలు పెదవి కొరుకుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ చైర్ పర్సన్ పీఠంపై ముసలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైర్ పర్సన్ కి పదవి గండం ఉందనేది రాజకీయ వర్గాల్లో ఉంది. రాష్ట్ర శాసనసభ సమావేశాల అనంతరం మరోసారి ఆర్మూరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం వ్యవహారం తెరపైకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ తరుణంలో మున్సిపల్ చైర్ పర్సన్ కుర్చీలో ఆమె మరిది కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఫోటో వివాదాస్పదం అవుతుంది.

మందలించి... తొలగించి...

ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ కుర్చీలో కూర్చున్న పండిత్ ప్రేమ్ ఫోటో వ్యవహారంపై అన్నదమ్ములు ఇద్దరు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిని మందలించి ఆయా గ్రూపులో నుంచి ఫోటోలను తొలగించే పనిలో ఉన్నారు. ఆర్మూర్లో ఒకరిద్దరిని ఇలాగే మందలించి ఫోటోలు తీయించినట్లు తెలుస్తుంది. గ్రూపులలో ఫోటోలు పెట్టినవారని మరి హెచ్చరించి ఫోటోలు తీయించడం ఆర్మూర్ లో ఆర్మూర్ రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలలో కూడా చర్చ మొదలైంది.

ప్రేమ్ అన్న ఇదేం తీరన్న... తస్మా జాగ్రత్త ... ఇది కుర్చిలాట.