గంజాయి స్మగ్లర్లు ఆరగురి పై పీడి యాక్ట్ ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఏసిపి శ్రీనివాస్

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:58
PD act against six ganja smugglers We will crush it with an iron foot ACP Srinivas

కాజీపేట టౌన్, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి)..///.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొట్ట మొదటి సారిగా గంజాయి స్మగ్లర్లు ఆరుగురిపై మడికొండ పోలీసులు ఒకే సారి పీడి యాక్ట్ నమోదు చేయడం జరిగిందని కాజీపేట ఏసిపి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మడికొండ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై టేకులగూడెం క్లాస్ రోడ్ వద్ద జూన్ 14వ రోజున మడికొండ పోలీస్ లు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా, ఒరిస్సా నుండి. రెండు కార్లలో మహారాష్ట్ర. తరలిస్తున్న 520 కేజీల గంజాయిని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అట్టి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారని తెలిపారు. వారి యొక్క రెండు కార్లను మొబైల్స్ ను సీజ్ చేయడమైనదన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ కమిషనరేట్ ఉత్తర్వులు మేరకు అట్టి ఆరుగురు వ్యక్తులపై పీడి యాక్ట్ చట్టం క్రింద నిర్భంద ఉత్తర్వ్యులు జారి చెయ్యగా, సదరు నేరస్తులు బేగర్ సందీప్ కుమార్ మర్పల్లి గ్రామం, రేగోడు మండలం, మెదక్ జిల్లా, పల్లె వినోద్ కుమార్, సోదారం గ్రామం, రేగోడు మండలం, మెదక్ జిల్లా, పోచారం ధనరాజ్ మర్పల్లి గ్రామం, రేగోడు మండలం, మెదక్ జిల్లా, సర్కూర్ రాహుల్, శాంతినగర్ కాలనీ, పటాన్చెరువు, సంగారెడ్డి జిల్లా. ఏర్పుల విశాల్, రాయకోడ్ గ్రామం, మండలం, సంగారెడ్డి జిల్లా, పోచారం శివరాజ్, మర్పల్లి గ్రామం, రేగోడు మండలం, మెదక్ జిల్లా లకు, చర్లపల్లి జైల్లో పీడి యాక్ట్ నిర్బంధ మడికొండ ఇన్స్పెక్టర్ వేణు అందజేశారని తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా, సేవించినా, అక్రమ రవాణాకు సహకరించినా లేదా ఏవైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా, వారి పైన కూడా పీడీ యాక్ట్ చట్టం ప్రకారం నమోదు చేయబడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.