రాపల్లి గ్రామంలో ఎలాంటి రాజకీయ కక్షలకు తావు లేదు

Submitted by Degala Veladri on Sun, 09/10/2022 - 09:28
There are no political parties in Rapalli village

రాపల్లి గ్రామంలో ఎలాంటి రాజకీయ కక్షలకు తావు లేదు

రాజకీయ పబ్బం కోసం పగటి వేశగాళ్ళు ఆడే ఆటలకు కాలమే సమాధానం చెపుతుంది

గ్రామ సర్పంచ్ మందడపు తిరుమలరావు

బోనకల్ అక్టోబర్ 08 ,ప్రజాజ్యోతి: శుక్రవారం రోజున మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో బోలం రమణ అనే మహిళ రైతుకు చెందిన మిరప మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు పీకిన సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ లబ్ది పొందాలని గ్రామంలో కొంతమంది అరాచక శక్తులు గత కొన్ని నెలలుగా చిల్లర వేషాలను వేస్తున్నారని,ఇలాంటి పరిణామాలతో గ్రామంలో అలజడలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని శనివారం గ్రామ సర్పంచ్ మందడపు తిరుమలరావు పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవను రాజకీయ రంగు పులిమి రాజకీయం చేయాలని చూడటం దారుణమని అన్నారు.మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్కకి గ్రామ సందర్శనలో తప్పుడు సమాచారం ఇచ్చారని,భట్టి విక్రమార్కని నేను దగ్గర నుండి చూసానని,విక్రమార్క సైతం ఇలాంటి చర్యలను ప్రోత్సహించరని తిరుమలరావు అన్నారు.గతంలో ఆటోలు తగలబెట్టిన వారు,విద్యుత్ మోటర్లు దొంగిలించిన వారు,మోటర్ సైకిళ్లు దొంగిలించిన వారు భట్టి విక్రమార్క సందర్శనలొనే ఉన్నారని అదే విషయం గ్రామ ప్రజలకు సైతం తెలుసునని వారిలో కొంతమంది సీపీఐ నుంచి,మరికొందరు సీపీఎం,కాంగ్రెస్ నుంచి రాజకీయం అనే ముసుగు వేసుకునే ఇలాంటి నీచ పనులు చేస్తూ పబ్బం గుడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలతో రాపల్లి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీసులు క్షుణ్ణంగా కేసును దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించి శాంతి యుత వాతావరణం గ్రామంలో తీసుకురావలాని కోరారు.