చిర్రగూడూర్ లొ ఘనంగా బతుకమ్మ వేడుకలు

Submitted by sudhakar on Mon, 26/09/2022 - 13:34
Bathukamma celebrations in Chirragudur

అడ్డగూడూర్, సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి) .//..అడ్డగూడూరు మండలంలో గల చిర్ర గూడూరు గ్రామం లో తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతాయి. అలాగని తొమ్మిది రోజులూ ఒకేలా జరగవు. తొమ్మిది రోజులూ తొమ్మిది తీర్లుగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ వేడుకల్లో ఏరోజుకారోజే ప్రత్యేకం. రోజుకో విశిష్టత ఉంటుంది.మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ఇవి కూడా చాలా సంప్రదాయబద్దంగా జరుగుతాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అంటే ఈ రోజుకంటేఒకరోజుముందుగానేబతుకమ్మనుఅలంకరించడానికిపూలుకోస్తారు.అవిమరుసటిరోజుకువాడిపోకుండానీళ్లలోవేసితర్వాతిరోజుబతుకమ్మగాపేరుస్తారు.అందుకే ఈ బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ రోజు మహిళలు తమలపాకులు, తులసి ఆకులను వాయనంగా ఇస్తారు. రెండోరోజు తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు, గడ్డి పూలను సేకరించి, గౌరమ్మను పేరుస్తారు. సాయంత్రం పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అక్కడే నిమజ్జనం చేస్తారు.


ఆ రోజు ప్రసాదంగా అటుకులు పంచుతారు. ఇక మూడోరోజు సీతమ్మ జడ, చామంతి, రామ బాణం వంటి పూలతో బతుకమ్మను పేర్చి, ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. మూడోవరోజు బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసలు వాయనంగా ఇస్తారు. నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ నిర్వహిస్తారు. నాల్గోవరోజు గుమ్మడి, మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు.తర్వాత నానబెట్టిన బియ్యం, బెల్లంతో కలిపి వాయనంగా ఇస్తారు. ఇక ఐదో రోజు అట్ల బతుకమ్మ నిర్వహిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా పూజిస్తారు. చివరగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ఆడపడుచులంతా బతుకమ్మలు పేర్చి, వాటి చుట్టూ చేరి చప్పట్లు, కోలలతో, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.