అడ్డగూడూరులో నూతన అంగడి (సంత)ను ప్రారంభిస్తున్న ఎంపీపీ జడ్పిటిసి

Submitted by sudhakar on Sat, 17/09/2022 - 11:51
 MP ZPTC is starting a new Angadi (Santa) in Addagudur

అడ్డగూడూర్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి  న్యూస్ . స్థానిక అడ్డగూడూర్ మండల కేంద్రంలో నూతన అంగడి (సంత)ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల ఎంపీపీ దర్శనల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య ,ముఖ్య అతిధులుగా హాజరై  ప్రారంభించినారు ఈ సందర్భంగా
నాయకులు  మాట్లాడుతూ అడ్డగూడూర్ పరిసర ప్రాంత ప్రజలు అంగడిని వినియోగించు కోవాలని అన్నారు .అందరు పరస్పరం సహకరించుకొని మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయలని అన్నారు. సర్పంచ్ త్రివేణి దుర్గయ్య మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే  గదారి  కోషోర్ కుమార్ ఆదేశానుసరం మీ అందరి సహకారం తో అడ్డగూడూర్ ను సాయశక్తుల అభివృద్ది చేశాము.  ఇంకా కొంచం మిగిలిన పనులు పూర్తి చేస్తామని ఆన్నారు. అడ్డగూడూర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ,జిల్లా కో అప్షన్ గుండిగా జోసప్, ఎంపీటీసీ పెండల భారతమ్మ  మాజీ మార్కెట్ డైరెక్టర్ పూలపల్లి జనార్దన్ రెడ్డి, చౌగోని మంజుల సత్యం  ఖమ్మం పాటి నరేందర్ టిఆర్ఎస్విఉపాధ్యక్షుడు,సామా ఆంజనేయులు ,గజ్జెల్లి రవి ,బాలెంల నరేష్ తెరాస ఎస్సి సెల్  పట్టణ శాఖ అధ్యక్షులు బాలెంల నరేష్ ,బాలెంల అయోధ్య ,పాక సింహాద్రి,  పయ్యావుల రమేష్ ,బాలెంల నరెందర్ ,అలవాలా శంకర్   ,తుంగపాటి  సోమన్న , గంట నరేందర్ రెడ్డి, మందుల వెంకటేష్, డప్పు వెంకన్న నాయకులు గ్రామ ప్రజలు వ్యాపారస్తులు పాల్గొన్నారు..