మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలి బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 13:01
Minister Harish Rao should resign   BSP Nakirekal Constituency Incharge Madi Priyadarshini

నల్లగొండ సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి)..../  కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన గర్భిణి అఖిల మృతికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే రాజీనామా చేయాలని బిఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి  డిమాండ్ చేశారు.బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ప్రియదర్శిని మాట్లాడుతూ ఆడవారికి బిడ్డను కనడం మరో జన్మ లాంటిదని, పురిటి నొప్పులు ఎంత భయంకరంగా  ఉంటాయో  అనుభవించిన వారికే తెలుస్తోందని, మాటల్లో ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందన్నారు. కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఆడవారు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు ఒక మహిళ పురిటి నొప్పులతో అల్లాడుతుంటే సాధారణమైన మహిళకే కంటనీరు వస్తూ ఉంటుంది అయితే వీరు నర్సులు ఒక బాధ్యత యుతమైన పని చేస్తున్నారు. హాస్పిటల్ కు వచ్చిన వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి వారితో నీచంగా ప్రవర్తించి ఆడజాతికి మాయని మచ్చగా మారి హంతకులయ్యారు.ఈనెల 12న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు అఖిలకు మొదటి కానుపు కావడంతో అందులోనూ చిన్నవయసు కావడంతో పురిటి నొప్పులు తట్టుకోలేకపోయింది.అఖిల కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న నర్సులతో ఎలాగైనా ఆపరేషన్ చేయాలని  వేడుకున్నారు. అయితే సదరు నర్సులు మాత్రం కొంచెం కూడా మానవత్వం లేకుండా అఖిలను వార్డు లోపలికి తోసి హింసించారు।ఎందుకు అట్లా అరుస్తున్నావు?పడుకున్నప్పుడు లేదా ఇలా నొప్పులు వస్తాయని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఆమెకు కాన్పు చేయడానికి సిద్ధమయ్యారు.అప్పటికే అఖిల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె అత్త పూలమ్మ త్వరగా కానుపు  చేయమని బ్రతిమాలినా, ఇదేమైనా ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నావా నొప్పిలు రాగానే కానుపు చేయడానికి, మాకు తెలుసులే అని ఆమె కళ్ళముందే అఖిల కడుపుపై కాలితో తొక్కుతూ, తోస్తూ టైంపాస్ చేశారు. ఇక ఆ ఒత్తిడికి తట్టుకోలేని అఖిల మగ బిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోయింది. అంత జరిగిన నర్సులు నిర్లక్ష్యంగా సెల్ ఫోన్లో   ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఒక కానుపుకు పైసలు ఇస్తా అంటే ఆశపడి ఇలా చేస్తున్నారు అని అన్నారు.ఇలా ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తారు అని విమర్శించారు.ఇబ్రహీంపట్నంలో బాలింతల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళల మరణానికి కారణం ప్రభుత్వమే. అలాగే అఖిల మృతికి భాద్యత వహిస్తూ మంత్రి హరీశ్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్, సిబ్బంది ని తక్షణమే విధుల నుండి తొలగించాలని పేర్కొన్నారు.జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ  అధ్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాధగోని రవీందర్ ,చిట్యాల మండల అధ్యక్షులు చుక్క పూజిత,నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ముత్యాల రమేష్,నాయకులు  సైదమ్మ,మునుగోటి సత్తయ్య,మేడి కృష్ణ, గండమల్ల మహేష్,సురారపు సంజీవ,శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.