కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 10:09
Kalyana Lakshmi, Shadi Mubarak is an ideal for the country

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

నల్లగొండ సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి)./...50 మందికి కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్  చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం కేతపల్లి మండలానికి చెందిన 50మందికి కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టిందనినిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు.