23న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా ను జయప్రదం చేయండి

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 13:04
Jayapradham the dharna in front of the Collector's office on 23rd


తెలంగాణ ప్రజ సంఘాల పోరాట వేదిక

నల్లగొండ సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి) .. ఇండ్లు,ఇళ్లస్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధనకై ఈనెల 23న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు.బుధవారం సుందరయ్య భవన్ లో  తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక నల్లగొండ పట్టణ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు.ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని, అరులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణంకు 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు  ఇవ్వాలని కోరారు.అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పేదలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, ఆవాజ్  జిల్లా కోశాధికారి మహబూబ్ అలీ, పట్టణ కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్ సాజిద్,  వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు రుద్రాక్ష యాదయ్య, రైతు సంఘం పట్టణ సహాయ కార్యదర్శి ఉట్కూరు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.