తొర్రూరు ప్రాంత సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:11
Jayapradam round table meeting on Thorrur area issues

తొర్రూరు సెప్టెంబర్ 27( ప్రజా జ్యోతి) .../// తొర్రూరు ప్రాంత సమస్యలపై ఈనెల 29న లైన్స్ క్లబ్ భవనంలో జరుగు రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వానాన్ని నేడు స్థానిక విశ్రాంతి భవనంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈ పోరాట కమిటీ కన్వీనర్ తమ్మెర విశ్వేశ్వరరావు కో కన్వీనర్ కొత్తపల్లి రవి కో కన్వీనర్ బొల్లం అశోకులు మాట్లాడుతూ డివిజన్ కేంద్రమైన తోరూర్ లో ప్రభుత్వ ఆస్పటల్ 100 పడకలుగా మార్చాలని మార్చురుని వెంటనే ప్రారంభించాలని అన్నారు.ఎస్ టి ఓ,సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, తొర్రూరు పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తానని ప్రారంభించిన పనులు ఎందుకు ఆగినయని వారు అన్నారు.తొర్రూరు పట్టణంలో జాతీయ రహదారి సాసర్ రోడ్డు కాకుండా డ్రైనేజీ రోడ్డుగా మార్చాలని లేదంటే అనేకమంది పడిపోతూ గాయాల పాలవుతున్నారని అన్నారు. ఇంకా తదితర సమస్యలను చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నామని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, విద్యాసంస్థల అధినేతలు, వ్యాపారస్తులు, డాక్టర్స్, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్ని వర్గాల వారు హాజరు కావాలని తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట కమిటీ తరఫున పిలుపునిస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముంజంపల్లి వీరన్న బొల్లం అశోక్ గట్టు శ్రీమన్నారాయణ బందు మహేందర్ దొరక దర్గయ్య మాలోతు సురేష్ జమ్ముల శీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.