సోనాల ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించాలి

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:39
 Irrigation should be provided to the farmers through the Sonala upliftment scheme

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి

బజార్ హత్నూర్ సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి)  //... సోనాల గ్రామ వాగుపై 300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు దాదాపు రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) అధికారుల అలసత్వం, గుత్తేదారు ల నిర్లక్ష్యం వల్ల రైతులకు ఉపయోగపడకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  నీటిపారుదల శాఖ అధికారులు మేలుకొని చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడే  ప్రధానంగా ఈ ఎత్తిపోతల పథకం లీకేజిలన గుర్తించి, పైప్ లైన్లను సరిచేసి మరమ్మత్తులు నిర్వహించాల ని, కనీసం ఈ యాసంగి పంటకాలం వరకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సల్ల రవి, సర్దార్, రాహుల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.