హస్టల్స్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి - జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్

Submitted by kareem Md on Mon, 19/09/2022 - 16:12
Problems of hustle workers should be solved - District Secretary Kurra Shankar Naik

ఫోటో రైటప్ తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పిస్తున్న హాస్టల్స్ వర్కర్లు.
హలియా,సెప్టెంబర్19(ప్రజా జ్యోతి):  
గిరిజన హాస్టల్స్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్ డిమాండ్ చేశారు.సోమవారం  గిరిజన సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పెద్దవూర తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ హాస్టల్లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కర్లకు ఇప్పటికీ నెలసరి వేతనం 5500 రూపాయలు చెల్లిస్తున్నారని అన్నారు. నిత్యవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారితో వెట్టి చాకరి చేయించుకోవడం సరికాదని అన్నారు.కనీస వేతనం చట్టా ప్రకారం నెలకు 22,500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్న వర్కర్లను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమావత నరేష్ నాయక్,హాస్టల్ వర్కర్లు రాము నాగేందర్,రాములమ్మ వాణిజమ్మ,రాజేశ్వరి వెంకటమ్మ,మల్లేశ్వరి  తదితరులు పాల్గొన్నారు.