గిరిజన సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

Submitted by sridhar on Mon, 19/09/2022 - 14:37
 Palabhishekam for KCR's film under the auspices of the tribal association.

అచ్చంపేట సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ గిరిజన బంధు అమలు చేస్తానని ప్రకటన చేసిన సందర్భంగా ఆదివారం అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గిరిజన నేతలు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల పట్ల సానుకూలంగా స్పందించి ఆరు నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా గొప్ప విషయమని వారు పేర్కొన్నారు అదేవిధంగా గిరిజన బంధు కూడా అమలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడం గిరిజనులకు చాలా వరమని ఈ సందర్భంగా తెలిపారు గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్య మంత్రి గిరిజన బంధు అమలు చేస్తానని చెప్పడం చాలా సంతోషమన్నారు అదేవిధంగా హైదరాబాదులో గిరిజనులకు ప్రత్యేకించి భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా గిరిజనుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని గిరిజన నేతలు పేర్కొన్నారు.

దీంతోపాటు బల్మూరు మండలంలోని రామనగర్ కాలనీలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ గిరిజన బంధు అమలు చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా రామ్ నగర్ సర్పంచ్ శ్రీరామ్ నాయక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపాల్ నాయకులు గిరిజన మహిళలు నేతలతో కలిసి కెసిఆర్ కు పాలాభిషేకం చేశారు అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో జడ్పిటిసి మంత్రియ నాయక్ రంగాపూర్ సర్పంచ్ లోక్యా.నాయక్ మాజీ మున్సిపల్ చైర్మన్ తులసి రామ్ గోపాల్ నాయక్ బాఘ నాయక్ హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్.కెసిఆర్ కు పాలాభిషేకం చేస్తున్న నేతలు.