బాల అదాలత్ బెంచ్ విజయవంతం చేయాలి. అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 15:58
Bal Adalat bench should succeed.    Additional Collector G. Sandhyarani

హనుమకొండ, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)  .. 21 సెప్టెంబర్ బుధవారం రోజున హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే బాల అదాలత్ బెంచ్ విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అధికారులకు సూచించారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు బాల బాలికల సమస్యలు పరిష్కరించే క్రమంలో భాగంగా బాల బాలికలు, వారి తల్లితండ్రులు, సంరక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని, ఒక రోజంతా పిల్లల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం బాల అదాలత్ బెంచ్ దోహదపడుతుందని అన్నారు. బాల అదాలత్ బెంచ్ విజయవంతం కావడానికి సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. బెంచ్ ఏర్పాటు రోజున ఒక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి స్థాయి ర్యాంకు అధికారితో పాటు సంబంధిత పోలీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యలు లిఖిత పూర్వకంగా తెలియచేయుటకు సహకరించుటకుగాను ఉపాధ్యాయ బృందాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ  అధికారులకు సూచించారు.బాల అదాలత్ కార్యక్రమాన్ని మూడు విధాలుగా నిర్వహిస్తామని ఒకటి ప్రారంభ కార్యక్రమం గా, రెండవది బాల అదాలత్ బెంచ్ గా, మూడవది ముగింపు సమావేశం గా నిర్వహించి ఆర్జీ పెట్టుకున్న వారి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తదుపరి చర్యలు తీసుకోనుందని అన్నారు. బాల అదాలత్ కు వచ్చే బాల బాలికలకు అర్జీదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాల బాలికలు ఆకలికి ఇబ్బందులు పడకుండా భోజన సదుపాయం కల్పించాలని, జిల్లా సంక్షేమశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంరక్షణ కేంద్రాల పిల్లలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

జిల్లాలో తొలి సారిగా నిర్వహిస్తున్న బాల అదాలత్ బెంచ్ ను విజయవంతం చేయుటకు ప్రతి అధికారి అంకిత భావంతో పని చేయాలని అన్నారు. సఖి వన్స్తాప్, చైల్డ్ లైన్, పోషణ అభియాన్, విద్య, సంక్షేమ గురుకులాలు, వైద్యారోగ్య  శాఖ వారు స్టాల్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, సమాచార పౌర సంబంధాల డిప్యూటీ ఇంజనీర్ భూపాల్, ఎన్సిఎల్పి డైరెక్టర్ బుర్ర అశోక్, డిఎంహెచ్వో డాక్టర్ బి సాంబశివ రావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి గోపాల్, కార్మిక శాఖ ఉప కమిషనర్ డాక్టర్ సామ్యూల్ జాన్, సహాయ కార్మిక శాఖ అధికారి ప్రసాద రావు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి నిర్మల సిడిపివోలు భాగ్యలక్ష్మి స్వరూప, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పి సుధాకర్, ఎస్ రాజేంద్ర ప్రసాద్, బాలల న్యాయ మండలి సభ్యులు మెరుగు సుభాష్, జెండర్ ఎక్స్పర్ట్ కో ఆర్డినేటర్ జయ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ లు ఎండీ ఇక్బాల్ పాషా, రాగి కృష్ణ మూర్తి, సఖి అడ్మిన్ పి హైమావతి, శిశు గృహ సోషల్ వర్కర్ సంగి చైతన్య, పి విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు, అనంతరం స్టాల్ ఏర్పాట్లు, సమావేశ స్థల పరిశీలన ఆర్డీవో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్ లతో కలిసి పర్యవేక్షించారు.