సాధనతో లక్ష్యం సాధికారిత ఎస్సై బోడి గే రామకృష్ణ గౌడ్

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 10:44
The goal is empowered with practice  Essay Bodi Gay Ramakrishna Goud

 కరాటే లో ప్రతిభ కనబరిచిన  శ్రీ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు సన్మానం 
నార్కట్ పల్లి సెప్టెంబర్ 19( ప్రజా జ్యోతి)..  లక్ష్యం సాధించాలంటే సాధన తోనే సాధ్యమవుతుందని నార్కట్ పల్లి  ఎస్సై బొడిగె  రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు.సోమవారం మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం  శ్రీకృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఈనెల 18న హైదరాబాద్ లోని సుమన్ శోటోఖాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో కల్నాన్సంతోష్ బాబు  మెమోరియల్ ఓపె న్ కరాటే కుంఫ్పూ చాపియన్ షిప్ పోటీలు కోట్ల విజయభాస్కర్రెడ్డిస్టేడియం, యూసుఫ్ గూడా లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన .ఎల్లారెడ్డిగూడెంలోని శ్రీ క్రిష్ణవేణిహైస్కూల్లోని శావోలిన్ శోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల కుసోమవారం మెడల్స్ అందజేసి జ్ఞాపికలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా. ప్రతి ఒక్కరూ రోజు ఒక గంట మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన సమాజంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టవచ్చని చెప్పారు. విద్యార్థిని విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకొని లక్ష్యసాధనకై  ఉపాధ్యాయులు చూపిన బాటలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండి సా దత్ అలి పాఠశాల కరస్పాండెంట్ మట్ట చెన్నయ్య గౌడ్  శ్ర్   క్రిష్ణవేణి హైస్కూల్ ఛైర్మన్ మట్ట సబిత ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.