ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ వినియోగించుకొని భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి జిల్లా కలెక్టర్ శశాంక*

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:19
 Future students should take advantage of the NMMS scholarship  District Collector Shashanka*


విద్యార్థులతో పాటు సమానంగా కింద కూర్చున్న జిల్లా కలెక్టర్ కె శేషాంకా

తొర్రూరు సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి.../.. వందేమాతరం ఫౌండేషన్ లో నిర్వహిస్తున్న ఎన్ ఎం ఎం ఎస్ శిక్షణ శిబిరంకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ వారు పొందుతున్న శిక్షణ శిబిరంలో వసతులను ఎక్కడి నుంచి వచ్చారో వివరాలను అడిగి తెలుసుకొని, పలు అంశాలపై నిర్వాహకులతో మాట్లాడారు.116వ భగత్ సింగ్ జయంతి పురస్కరించుకొని, జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు.23 సంవత్సరాలకే దేశం కోసం ఉరి తీయబడ్డ స్వాతంత్ర సమరయోధులు లో ముఖ్యుడని భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 300లకు పైచిలుకు మంది మెరిట్ స్కాలర్షిప్ కోసం అర్హత సాధించాలనే  శిక్షణ పొందుతున్నారని, 1 కోటి14 లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉందని, గతంలో కూడా వందేమాతరం ఫౌండేషన్ శిక్షణ పొంది 74 మంది 34 లక్షలు పొందారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.చదువును కొనలేని పిల్లలే విద్య పై ఒక విజన్తో ఉంటారని, పోస్ట్ మెట్రిక్ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్పులు పొంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, వారం రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని సద్వినియోగ చేసుకోవాలని 2న ముగియనుందని తెలిపారు.

విద్యార్థులకు 2 చక్రాలు ఉపాధ్యాయులు అమ్మానాన్నలని వారి మాటలను తూచ తప్పకూడదని, బుద్ధుడు అశోక చక్రవర్తి ఎలాగైతే భోగభాగ్యాలను వదిలి ఏలా జ్ఞానం వైపు నడిచారో అలాగే మీరు కూడా ఇల్లు వదిలి వచ్చినందుకు ప్రతిఫలం సాధించి లక్ష్యం కోసం పరివర్తన చెందాలని, మన చదువుతో విజ్ఞానంతో ఇల్లును సమాజంలో జ్ఞానం వైపు మార్పులు తీసుకురావాలని, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, మంచి పుస్తకాలను కొనుక్కొని వాటితో కుస్తీ పట్టాలని, ప్రతి సబ్జెక్టులపై నైపుణ్యాలను పొందాలని,8వ తరగతి నుండే ఇలాంటి స్కాలర్షిప్ల పై అవగాహన కల్పించడం వారి విద్యార్థుల భవిష్యత్తు పై వారికి అవగాహన కల్పించడమేనని, 10 సంవత్సరాలు కష్టపడి చదివితే భవిష్యత్తు అంతా మీరు అనుకున్న విధంగా జీవించవచ్చునని కలెక్టర్ తెలిపారు.క్రమశిక్షణ అవసరమని పోటీ ప్రపంచానికి సవాలుగా చదివితే నే మీ శక్తియుక్తులు తెలుస్తాయని, విద్యార్థి వెనకాల గొప్ప నేపథ్యంలో ఉంటుందని ఏర్పాటు చేసుకొని సాధన చేయడం ప్రశంసించదగ్గ అరుదైన విషయమని కలెక్టర్ తెలిపి విద్యార్థులను దీవించారు.ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ రవీందర్ రావు, డి ఈ ఓ అబ్దుల్ హై ,ఆర్ డి ఓ ఎల్.రమేష్, తహసిల్దార్ రాఘవరెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ బుచ్చయ్య,  తదితరులు పాల్గొన్నారు.