ఏనుగు ఘింకరిస్తోంది...  పులులు కాదు అనకొండలే... బాన్సువాడలో బలపడుతున్న ఏనుగు...

Submitted by SANJEEVAIAH on Sun, 31/03/2024 - 08:21
Photo

ఏనుగు ఘింకరిస్తోంది...

 పులులు కాదు అనకొండలే...

బాన్సువాడలో బలపడుతున్న ఏనుగు...

(బాన్సువాడ ప్రత్యేక ప్రతినిధి - కె పండరినాథ్)

బాన్సువాడలో ఏనుగు బలపడుతుంది. రాజకీయ ప్రత్యర్థుల అవినీతిని ఎండగడుతూ ఘీంకరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ మందగమనంలో ఆఖరి సమయాన బిఫాంతో ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి    బాన్సువాడకు వచ్చారు. అప్పటికే, అప్పటి అధికార పక్షం అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రలోభాలు, ప్రచారంలో నియోజకవర్గంలో ఎదురు లేనీ శక్తిగా దూసుకు పోతున్నారు. మరోవైపు  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలు అయ్యాయి. స్ధానికత అంశాన్ని తెరపైకి తెచ్చి పార్టీ టికెట్టు ఆశించినా నాయకుడు నాటకీయ పరిణామాలకు తెర లేపాడు ఈ క్రమంలో పార్టీ అధికారంగా ప్రకటించిన ఏనుగు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

ఘింకారం...

ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.  కొందరు సీనియర్లు మరికొందరు పార్టీ సానుభూతిపరులు ఆయనకు అండగా నిలిచారు. దీంతో ఇదివరకు  ఫలితంగా తనకున్న అనుభవంతో పావులు కదిపారు.  ఫలితంగా వారం రోజుల్లోనే పరిస్థితి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి గుండె దడ పెంచారు. స్థానికతలోని ప్రధాన నాయక వర్గాన్ని అధిష్టానం బుజ్జగించేంది. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఏనుగు ఘింకారిస్తు ప్రధాన పక్షం దూకుడుకు కొంత వరకు కళ్లెం వేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

గాడ్రింపు లేవి...

ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షము అనేది నానుడి. బాన్సువాడ నియోజకవర్గం లో బలమైన నాయకుడు లేకపోవడం పోచారం శ్రీనివాస్ రెడ్డి వరుసగా గెలుస్తూ ఎదురులేని శక్తిగా  అవుతున్నాడు. దిశానిర్దేశం చేసే నాయకుడు లేక ప్రతిపక్ష పార్టీలు బలహీన పడుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అధికారంలో ఉన్న నాయకుడు వారి కుటుంబీకులు ఉండే పోకడలు అవలంబిస్తూ పనితివేసే ధోరణిని ఆలంబిస్తున్నారు. ఎదురులేక ఎదురు తిరిగిన వారిపై అధికారులను ఉసి గొల్పుతు కలుపుతూ భయభ్రాంతులను చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడం వీరి అహంకారపు ఘింకారలు ఆగిపోయాయని ప్రజలు చెబుతున్నారు. సింహాలు, పులులు వీరిని భజన చేసిన వారు పబ్బం గడుపుకునేవారు బాన్సువాడ నియోజకవర్గంలో చేశారు. అయితే ప్రతిపక్ష అభ్యర్థిగా మారడంతో అధికారం చేతిలో ఉన్న గాండ్రింపలు వినిపించడం లేదు. దీంతో వీరు సింహాలు పులులు కారు రాళ్లు ఇసుకను మింగి ఆర్థికంగా బల్పెక్కిన అనకాండ లు మాత్రమేనని వారి భజన పరువులకు బాధపడుతుందని స్వపక్షాలు విపక్షాలు చెబుతున్నాయి...