రైల్వే స్టేడియాన్ని పునః ప్రారంభించిన డిఆర్ఎం

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:19
DRM reopened Railway Stadium

కాజీపేట టౌన్, సెప్టెంబర్22 (ప్రజాజ్యోతి)..//..  కాజీపేట రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న రైల్వే స్టేడియాన్ని గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ పునః ప్రారంభించారు. సెప్టెంబర్ 2021 సంవత్సరంలో కాజీపేట రైల్వే స్టేడియం గ్యాలరీ, సభా ప్రాంగణం, పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో పాటు ప్రాంగణం ఎదురుగా మరొక షెడ్డు నిర్మాణం మరమ్మతులు మొదలుపెట్టి 9 నెలల్లో పూర్తి చేసినప్పటికీ, గత మూడు నెలల నుండి అకాల వర్షాల కారణంగా రైల్వే స్టేడియం పునః ప్రారంభానికి నోచుకోలేదు. సికింద్రాబాద్ డిఆర్ఎం ఆకస్మిక పర్యటనతో రైల్వే స్టేడియం ప్రారంభానికి నోచుకుందన్నారు. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ స్పెషల్ ట్రైన్ లో కాజీపేట రైల్వే స్టేషన్ కు ఉదయం కాజీపేట రైల్వే స్టేషన్ కు చేరుకొని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని, రైల్వే స్టేషన్ ఆరుబయట స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రైల్వే కార్మిక సోదర సోదరీమణులు నిర్వహించినటువంటి నాటక ప్రదర్శనను వీక్షించారు. నేరుగా రైల్వే స్టేడియం కు చేరుకుని రైల్వే ఇనిస్ట్యూట్ జనరల్ కాజీపేట ఆధ్వర్యంలో స్టేడియం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రైల్వే ఇనిస్టిట్యూట్ కమిటి వారు తరచుగా స్వచ్ఛభారత్ కార్యక్రమలు నిర్వహిస్తూ ఉండాలని, త్వరలో కాజీపేట రైల్వే స్టేడియంను క్రీడలకు, ఇతర  కిరాయికి ఫంక్షన్లకు ఇవ్వడం కోసం రైల్వే ఇనిస్టిట్యూట్ జనరల్ కాజీపేట కమిటీ కి అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజన్ కోఆర్డినేటర్, సీనియర్ డిపిఓ అభిలాష్, సీనియర్ డిఎన్ఏ కాజీపేట సందీప్ కుమార్, సీనియర్ డిఈఈ ఇఎల్ఎస్ కాజీపేట వాసిం పాషా, సీనియర్ డివిజన్ స్టేషన్ మేనేజర్ తో పాటు ఎస్సిఆర్ఎంయు జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్, ఎస్సిఆర్ఎంయు డివిజనల్ సీక్రెటరి పిల్లలమర్రి రవీందర్, ఇనిస్టిట్యూట్ సీక్రెటరీ : దేవులపల్లి రాఘవేందర్, జాయింట్ సెక్రటరీ ఎం.రాజయ్య, ట్రెజరర్ ఎస్. రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు బి.మాధవరావు, సుంచు ప్రశాంత్, ధరావత్ రఘు, ప్రశాంత్ కుమార్, రైల్వే ఇనిస్టిట్యూట్ సభ్యులు పాల్గొన్నారు.