సదరం స్లాట్ విధానంతో వికలాంగుల అవస్థలు. (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్

Submitted by lenin guduru on Thu, 17/11/2022 - 06:53
బిట్ల గణేష్

సదరం స్లాట్ విధానంతో వికలాంగుల అవస్థలు

వికలాంగులను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదు

నవంబర్ 17న జరిగే ఎన్పిఆర్డీ జిల్లా సదస్సును జయప్రదం చేయండి

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్

జనగామ, నవంబర్ 16, (ప్రజాజ్యోతి);-

బోగస్ వికలాంగుల నిరోదించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదరం స్లాట్ బుకింగ్ తో అర్హులైన వికలాంగులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారని వెంటనే ప్రత్యేక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి రోజు స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్ చేశారు. నవంబర్ 17న జరిగే ఎన్పిఆర్డీ జనగామ జిల్లా సదస్సుకు వికలాంగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఎన్పిఆర్డీ జనగామ జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన జనగామ పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజాసంఘాల కార్యాలయంలో ఎన్పిఆర్డీ జనగామ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ బోగస్ వికలాంగులను నిరోధించడంలో ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు ఎన్పిఆర్డీ సహకరిస్తుందని, బోగస్ వికలాంగులకు ఎన్పిఆర్డీ వ్యతిరేకమని తెలిపారు. బోగస్ వికలాంగులను నిరోధించడం అనే సాకుతో అర్హులైన వికలాంగులను ఇబ్బందులకు గురిచేస్తే ఎన్పిఆర్డీ సహించదని హెచ్చరించారు. జిల్లా అధికారులు బోగస్ వికలాంగులను అరికట్టాలంటే సదరం స్లాట్ బుకింగ్ సిస్టమ్ వద్దకాదన్నారు. బోగస్ సదరం సర్టిఫికెట్లు ఎట్లా వస్తున్నాయో అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు? అసలే వికలాంగులు ఒకరి సహాయం, సహకారం లేనిదే బయటికి వెళ్లలేని వారిని బోగస్ సర్టిఫికెట్ల సాకుతో వికలాంగుల వైకల్యాల  దీన పరిస్థితులను, ఆర్ధిక స్థితిగతులను, మీ సేవా కేంద్రాల గమ్యాలను పరిశీలించకుండా వారిని మీ సేవా కేంద్రాల చుట్టూ తిప్పుతూ వారిని వ్యయప్రయాసాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. సదరం స్లాట్ బుకింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా ఇచ్చేవి పరిమితమైన సంఖ్య జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాలు సుమారు 60కి పైగా ఉన్నాయన్నారు. ఇలా ఇచ్చినవి ఒక్కక్షణంలో స్లాట్ బుకింగ్ చేసుకోవడం వల్ల చాలా మంది వికలాంగులు దారి మధ్యలోనే, మీసేవా కేంద్రాలకు వెళ్ళేలోపు స్లాట్ బుకింగ్ అయిపోవడంతో వికలాంగులు అవస్థలు వర్ణానాతీతం అన్నారు. ఒకవైపు ఆర్ధికంగా చితికిపోవడం, మరోవైపు వైకల్య భారంతో వికలాంగుల కుటుంబాలలో నిస్ర్పుహ లాంటివి ఏర్పడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్లాట్ బుకింగ్ ప్రతి రోజు ఉండేవిధంగా ప్రత్యేక సాప్ట్వేర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో వికలాంగులను సమీకరించి ఉద్యమిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా సీఎం కెసిఆర్ వికలాంగులను ఆసరా పింఛన్ దారులుగానే చూస్తున్నారని తెలిపారు. వికలాంగుల ఉద్యోగ నియామకాల ఊసేఎత్తని రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని పతనం తప్పదని అన్నారు. ఎన్పిఆర్డీ వికలాంగులకు సమాన హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర సమస్యల సాధనకై నిరంతరం ప్రభుత్వంతో పోరాటం చేస్తుందని తెలిపారు. నవంబర్ 17న జరిగే ఎన్పిఆర్డీ జనగామ జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సదస్సులో వికలాంగుల ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, సమస్యల సాధనకై ఈ సదస్సులో భవిష్యత్ పోరాటాల రూపకల్పనకు  కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ సదస్సుకు వికలాంగులు పెద్దఎత్తున్న పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండవరం శ్రీదేవి, నాచు అరుణ, ఇట్టబోయిన మధు, నామాల రాజు, రావుల శ్రీనివాస్, బండ్రు శ్రీశైలం, మాలోతు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.