దేశంలోనే సహకార రంగం ఎంతో కీలకమైనది

Submitted by Guguloth veeranna on Fri, 18/11/2022 - 21:56
The co-operative sector is very important in the country

పాల్వంచ, నవంబర్ 18, ప్రజాజ్యోతి : భారతదేశంలోనే సహకార రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఎంతో కీలకమైనదని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. 69వ సహకార వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం రైతు వేదికలో రైతులతో సహకార వారోత్సవాల సభ నిర్వహించారు. ఈ సభలో కొత్వాలతో పాటు జిల్లా సహకార అధికారి ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ అవసరాన్ని గుర్తించిన కేంద్రం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలోని తెలంగాణా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. రైతులు సహకార సంఘాల ద్వారానే ఆర్థికంగా బలపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఒ. ఎన్.వెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, కో- ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ వసుమతి, వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, సొసైటీ డైరెక్టర్లు చౌగాని పాపారావు, సామా జనార్దన్ రెడ్డి, మైనేని వెంకటేశ్వరరావు, భూక్య కిషన్, బర్ల వెంకటరమణ,ఎ.ఇ.ఒ. అనురికా, ఎంపీటీసీలు భూక్య శంకర్, మద్దుల వీర మోహన్ రావు, సూరారం ఉపసర్పంచ్ జక్కుల వెంకటేశ్వర్లు, సొసైటీ సీఈవో లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి, లక్ష్మి, డిసిసిబి సూపర్వైజర్ సురేష్, రైతులు నాగిరెడ్డి, బిచ్చా, రాజేశ్వర రావు, వాలు తదితరులు పాల్గొన్నారు.