బిజెపి, బిఅర్ఎస్ లు అభివృద్ధికి అవరోధాలు... పదేళ్లలో నిజామాబాద్ కు బిఅర్ఎస్ చేసింది శూన్యం... బిజెపి ఎంపి అరవింద్ రైతులను మోసం చేశారు... కాంగ్రెస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి... నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్...

Submitted by SANJEEVAIAH on Wed, 24/04/2024 - 15:25
Photo

బిజెపి, బిఅర్ఎస్ లు అభివృద్ధికి అవరోధాలు...

పదేళ్లలో నిజామాబాద్ కు బిఅర్ఎస్ చేసింది శూన్యం...

బిజెపి ఎంపి అరవింద్ రైతులను మోసం చేశారు...

కాంగ్రెస్ ను గెలిపిస్తే స్టేడియం ఏర్పాటుకు కృషి...

కాంగ్రెస్ హయంలోనే జిల్లా అభివృద్ధి...

మోడీవి అన్ని తప్పుడు హామీలే...

కాంగ్రెస్ ను గెలిపిస్తేనే జిల్లా మరింత అభివృద్ధి...

కాంగ్రెస్ నాయకులు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు...

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

కాంగ్రెస్ ను గెలిపిస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని, బిజెపి, బిఅర్ఎస్ పార్టీలు, ఆ నాయకులు అభివృద్ధి నిరోధకులని కాంగ్రెస్ నాయకులు, నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. బుధవారం ప్రగతినగర్ మూన్నురు కాపు సంఘం లో విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. అయన మాటల్లోనే...

నిజామాబాద్‌ జిల్లాకు, నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీలు చేసింది శూన్యం. పదేళ్లు పాలించిన బిఅర్‌ఎస్‌ జిల్లాపై శీతకన్ను వేసింది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఎంపిగా ఉన్న పదేళ్ల పాలనలో జిల్లాను మరో పదేళ్ల పాటు వెనక్కి నెట్టివేసారు. అందుకు ఉదహరణ మన ముందు ఏన్నో ఉన్నాయి. చివరకు కలెక్టరేట్‌ కూల్చివేసారు. కనీసం ఓ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ లేదు. కాంగ్రెస్‌ హయంలో స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ కోసం కేటాయించిన రూరల్‌ మండలంలోని ముబారక్‌నగర్‌ శివారులోని సర్వే నంబర్‌ 106 ను అయా సంఘాల పేరుతో కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇటు ఉన్న కలెక్టర్‌ మైదానాన్ని తొలిగించే ప్రయత్నాలు చేసారు. క్రీడా సంఘాల వారు అడ్డుకోవడంతో అది అగింది. ఇక బిఅర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన భూకబ్జాలు చేశారు. పట్టా భూములను బెదిరించి లాక్కున్నారు. నాగారంలో భూములను కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పసుపుబోర్డును తెరమీదకు తెచ్చారు. కానీ ప్రణాళిక బద్దంగా పని చేయకపోవడం, ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని హామి ఇచ్చి అ ఫ్యాక్టరీనీ అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు చేసారు. అందుకే రైతులు అమెను గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒడిరచారు. అదే పసుపు బోర్డు, షుగర్‌ ఫ్యాక్టరీ వ్యవహారాలను అడ్డం పెట్టుకొని బిజెపి, నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అరవింద్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక బాండ్‌పేపర్‌ రాసి హామి ఇవ్వడంతో పసుపు రైతులు నమ్మారు. అందుకే బిజెపిని గెలిపించారు. కానీ పసుపు బోర్డును పాతరేసి, నామ మాత్రంగా రైతులను నమ్మించేందుకు స్సైసెస్‌ (సుగంధ ధ్రవ్యాల బోర్డు) బోర్డును తెచ్చారు. పసుపు లేని స్సైసెస్‌ బోర్డు ఏందుకో పిఎం మోడీ, బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌లు పసుపు రైతులకు సమాధానం చెప్పాలి. ఇక ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీ విషయంలో ఎంపి అరవింద్‌ పాదయాత్ర చేసి మరి హామి ఇచ్చారు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెబుతున్నారు అవునా. దేశ ప్రధాన మంత్రి ప్రకటన చేసి తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంతకు తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. మరోక ప్రాంతానికి తరలిస్తారా అనేది రైతులకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. ఇక షుగర్‌ ఫ్యాక్టరీ విషయంలో ఎంపి అరవింద్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఫ్యాక్టరీని తెరిపించడంలో ఏం అడ్డంకి వచ్చిందని అడుగుతున్నాను. పాపం ఈ విషయం నిజామాబాద్‌ ఎంపి అరవింద్‌కు తెలియదా.? లేదా.? లేక కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర పప్పులు ఉడకాక రైతులను, జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారా సమాధానం చెప్పాలి. ఇక ఎంపిగా ఉన్న అయిదేళ్లలో జిల్లాకు ఏం చేసారో సమాధానం చెప్పాలి. ఒక ఎంపిగా మెడికల్‌ కళాశాలకు, తెలంగాణ యూనివర్శిటీకి ఏం గ్రాంట్‌లు, నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నిస్తున్నాను. మోడీ జాపం చేయడం తప్పా జిల్లాకు చెసింది ఏం లేదు. 

ఎన్నికల స్టంట్‌ కోసమే కొత్త నాటకాలు...

బిజెపి తెలంగాణ రాష్ట్రంలో, నిజామాబాద్‌ జిల్లాలో ఎన్నికల స్టంట్‌ కోసం కొత్త నాటకం ఆడుతున్నారు. బిఅర్‌ఎస్‌, బిజెపిలు దొందుదొందే. రాముడి పేరు చెప్పి ఓట్ల జపం చేస్తున్న బిజెపికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. తెలంగాణలో బిఅర్‌ఎస్‌ను పదేళ్లు మోసిన ప్రజలు మొన్న ఎన్నికల్లో ఇంటికి పంపారు. నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన పసుపు బోర్డు మంచి ఉదహారణ. ఇక మతాల మద్య చిచ్చు పెట్టి బిజెపి హిందువుల ఓట్లు రాబట్టుకునే కుట్రలు చేస్తుంది. నిజంగా దేవాలయాల మీద అంత చిత్తశుద్ది అంటే నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పెద్ద రామమందిరం, కంఠేశ్వర అలయం, హనుమాన్‌ టెంపుల్‌ భూములను పరిరక్షించాలి. అది వదిలేసి హిందు ముస్లిం అంటు మతాల మద్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే నాటకం ఆడటం సిగ్గుచేటు. 
ఇక జిల్లాకు కాంగ్రెస్‌ చేసిందే చివరిది. కాంగ్రెస్‌ హాయంలో జిల్లాకు ఉత్తిపోతల పథకాలు, తెలంగాణ యూనివర్శిటీ, మెడికల్‌ కళాశాల, అండర్‌ గ్రౌండ్‌ డ్రౌనేజీ, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే. వీటిలో పదేళ్లలో బిఅర్‌ఎస్‌, అయిదేళ్లలో బిజెపి ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి. మంత్రిగా ధర్మపురి శ్రీనివాస్‌ (డిఎస్‌) పని చేసినప్పుడు ఇవ్వన్ని కాంగ్రెస్‌ చేసేందే కదా. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. కానీ పదేళ్లు రేపు ఎల్లుండి అంటు జర్నలిస్టులకు గజం జాగా ఇవ్వలేకపోయారు. డి.శ్రీనివాస్‌ ఇచ్చిన నిధులతో కట్టిన ప్రెస్‌ క్లబ్‌ ను కూల్చే ప్రయత్నం బిఅర్‌ఎస్‌ చేసింది. 
అందుకే అభివృద్ది కోసం, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న కాంగ్రెస్‌ను, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి టి.జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, జిల్లా ప్రజలు కాంగ్రెస్ కు ఓటువేసి గెలిపించాలని కోరారు..