ఐజ మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 13:13
 Bathukamma celebrations in Aija Municipality

బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా: ఎమ్మెల్యే అబ్రహం  పాల్గొన్నరు
 అలంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30:  ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఐజ పురపాలక సంఘచైర్మన్ చిన్న దేవాన్న ఆధ్వర్యంలో,మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఇటు వేడుకలలో ఐజ పట్టణంలో భారీ ఎత్తులో మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్పీలు, పొదుపు సంఘం లీడర్లు, తదితరులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతంగా చేశారు,
ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఇట్టి బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడపడుచు ఇట్టి బతుకమ్మ వేడుకలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసిఆర్ చెప్పడం జరిగింది, కనుక ఈ బతుకమ్మ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా గుర్తించి ప్రతి ఇంట్లో ఒక పండగగా చేసుకుంటూ ప్రభుత్వం  మరియు ప్రైవేటు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను చేసుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఐటి శాఖ మంత్రి కేటీఆర్, తెలియజేయడం జరిగింది, కనుక ఇట్టి వేడుకలను అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే  తమ మాటల్లో తెలియజేశారు,

ఇట్టి కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చిన్నదేవన్న,వైస్ చైర్మన్ మాల నరసింహులు,అయిజ ఎస్సై నరేష్ కుమార్, మున్సిపాలిటీ కమిషనర్ గోల్కొండ నరసయ్య, ఏఈ గోపాల్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు,సీఎం సురేష్, చాకలి నరసింహులు, ఎండి ఖాజా, భాగ్యలక్ష్మి, సరళ, పావని, రనేమ్మ, అనితా, జులెఖబేగం, పూజరి వెంకటేష్, సువర్ణ, విజయలక్ష్మి, శశికళ, హుస్సేన్ బీ, నాగమ్మ, దేవరాజ్, ఆంజనేయులు, శ్రీ రామ్ లు,చాకలి హుస్సేన్, మున్సిపాలిటీ సిబ్బంది మేనేజర్ రాజేష్ కుమార్, ఆర్ ఐ లు లక్ష్మణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు