అనుబంధ రంగాలకు బ్యాంకర్లు రుణాలు సకాలంలో ఇవ్వాలి : అదనపు కలెక్టర్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:56
 Bankers should give loans to allied sectors on time : Additional Collector

ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): ములుగు జిల్లాలో చేపడుతున్న సంక్షేమ శాఖల పథకాలు, వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ అర్హులైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ వైవి.గణేష్ బ్యాంకు అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం నిర్వహించి, 2022-23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై జిల్లా అదనపు కలెక్టర్ బ్యాంకర్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వైవి గణేష్ మాట్లాడుతూ గ్రామాలలో ఉండే ప్రజలకు లబ్ధిదారులకు అందించే రుణ పథకాలపై పూర్తిగా అవగాహన కల్పించి,అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని, బ్యాంకుకు వచ్చే ఎస్ఎచ్ జి మహిళలకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను కోరారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరునెలలు గడుస్తున్న రుణ మంజూరు లక్షసాధన ఆశించిన మేరలేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాలో అమలు చేయాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని,బ్యాంకులు ఇచ్చే సబ్సిడీలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు.సంక్షేమ శాఖ అధికారులు వారికి నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్ లో ఉన్న,గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తి చేయాలని అన్నారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్య సాధనకు సంక్షేమ అధికారులు,ఒక్కో బ్యాంకు నుంచి ఒక్కో బాధ్యుడిని చేర్చి వాట్సప్ గ్రూప్ పెట్టుకొని లక్ష్యాల పురోగతి పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కు సూచించారు. రుణాల మంజూరుతో పాటు రుణ రికవరీ లపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు రిసోర్స్ పర్సనల్ సహాయం తో రుణగ్రహీతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రుణ చెల్లింపుల ప్రాధాన్యతను వివరించి రికవరీల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు.ఈ సమావేశం ప్రారంభంకు ముందు ఎల్ డిఎం రాజ్ కుమార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణప్రణాళిక లక్ష్యాలు సాధింపులు ప్రగతిని వివరించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ రమాదేవి,డిఆర్ డిఓ నాగపద్మజ, ఎల్డీఎం టి.రాజ్ కుమార్, చంద్రశేఖర్ ఏజీఎం నాబార్డ్,అనిల్ కాల్ బోరే ఏజిఎం ఆర్బీఐ,ఐటిడిఏ ఏపిఓ వసంతరావు,ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి,డివిఎంహెచ్ఓ విజయభాస్కర్,శ్రీపతి జిల్లా ఫిషరీస్ అధికారి,వివిధ శాఖ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.