జిల్లాకి ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ రాక.

Submitted by Srikanthgali on Tue, 13/09/2022 - 17:20
Arrival of INTUC Central Core Committee in the district.

జిల్లాకి ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ రాక.

జిల్లాలో రెండు రోజుల పర్యటన.

కొత్తగూడెం క్రైమ్, సెప్టెంబర్ 13, ప్రజాజ్యోతి:

జిల్లాకి ఐఎన్టియుసి సెంట్రల్ కోర్ కమిటీ రాక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు మద్దతుగా అదేవిధంగా రానున్న సింగరేణి ఎలక్షన్స్ పైన దృష్టిసారించడం కోసం జిల్లాకు విచ్చేస్తున్నారు. కార్మికుల మద్దతు కార్మికుల సమస్యలు తెలుసుకొని యాజమాన్యం కార్మికులకు ప్రకటించాల్సిన లాభాల వాటా తదితర విషయాలకు సంబంధించి పూర్తి కార్యాచరణ ఐఎన్టియుసి సిద్ధం చేసిందని కొత్తగూడెం ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కేడెం ఆల్బర్ట్ అన్నారు. రానున్న ఎలక్షన్స్ లో ఐ ఎన్ టి సి విజయం సాధిస్తుందని బుధవారం నిర్వహించేటువంటి బాయ్ బాట ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ బృందం జిల్లాలో పర్యటించి యూనియన్ కి సంబంధించి కార్యాచరణ చేపడతారని తదుపరి రానున్న రోజుల్లో వ్యూహాత్మక ప్రణాళికలను చేపట్టి కార్మికుల మద్దతుతో సింగరేణి ప్రాంతంలో తమ జెండా ఎగర వేస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై గత పది నెలలుగా చర్చల పేరిట కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు పూనుకోవడం జరిగింది. కాంట్రాక్టు కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పలుమార్లు కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు సింగరేణి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన చర్చలు జరుపుకుంటూ ఆలస్యం చేస్తున్న తీరునకు నిరసనగా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 9వ తేదీ నుండి సమ్మె చేయడం జరుగుతుంది. వారి నిరసన కార్యక్రమాలకు మద్దత్తుగా యాజమాన్యం తో చర్చలకోసం సభ్యులు విచ్చేస్తున్నరన్నారు.