శ్రీనివాస రామానుజన్ అవార్డుకు ఎంపికైన వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:32
 Vavireddy Chandrasekhar Reddy was selected for the Srinivasa Ramanujan Award

గుర్రంపోడ్, సెప్టెంబర్ 30(ప్రజా జ్యోతి):   ప్రతిష్ఠాత్మక శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ 2022-23 ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు గుర్రంపోడు మండలకేంద్రానికి  చెందిన విద్యావేత్త వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వరించింది.గత పాతికేళ్లుగా విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.1996 వ సంవత్సరంలో గుర్రంపోడులో నవోదయ విద్యా సంస్థను స్థాపించి మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు అందుబాటులో చక్కని విద్య,వందలాది మంది విద్యార్థులకు చక్కని భవిష్యత్తును అందజేయడంలో ఆయన కృషి చేశారు.అంతేకాక 2002 వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యను గుర్రంపోడు మండల విద్యార్థులకు క్షత్రియ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చారు.  అక్టోబర్ 13 వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే  కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్లు అవార్డు గ్రహీత వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.